ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండలాగుడు పోటీల్లో విజేత నరసాపురం వృషభరాజములు

ABN, First Publish Date - 2023-03-30T23:20:56+05:30

శ్రీరామనవమి పురస్కరించుకుని చల్లగిరిగెల కోదండరామస్వామి ఆలయం సమీపంలో వృషభరాజములకు బండలాగుడు పోటీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పోరుమామిళ్ల, మార్చి 30 : శ్రీరామనవమి పురస్కరించుకుని చల్లగిరిగెల కోదండరామస్వామి ఆలయం సమీపంలో వృషభరాజములకు బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నరసాపురం గ్రామానికి చెందిన జగన్మోహన్‌రెడ్డి వృషభరాజములు ప్రఽథమ స్థానంలో నిలిచి రూ.80వేలు నగదు బహుమతి దక్కించుకున్నాయి. టీడీపీ నాయకుడు కమ్మవారిపల్లెకు చెందిన చెరుకూరి రవికుమార్‌ మొదటి బహమతి కింద డబ్బు అందించారు. అలాగే బెస్తవారిపేటకు చెందిన శంకరరెడ్డి వృషభరాజములు ద్వితీయ స్థానంలో నిలిచి రూ.60వేలు, అగ్రహానికి చెందిన జయన్న వృషభరాజములు మూడో స్థానంలో నిలిచి రూ.40వేలు దక్కించుకున్నాయి. బండలాగుడు పోటీలకు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ నాయకులు కొండా రామక్రిష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising