ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడిపోతున్న మూడుముళ్లు

ABN, First Publish Date - 2023-03-02T23:17:59+05:30

నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన జంటలు చిన్న చిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. కలిసి బతికేందుకు ససేమిరా అంటున్నారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు.. వందల జంటలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిన్నచిన్న వాటికీ పంతాలు

పెరుగుతున్న దంపతుల మధ్య విభేదాలు

మసకబారుతున్న బంధాలు

ప్రేమ వివాహాల పరిస్థితీ అంతే

అవగాహన లోపమే కారణం

కడప (క్రైం), మార్చి 2: నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన జంటలు చిన్న చిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. కలిసి బతికేందుకు ససేమిరా అంటున్నారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు.. వందల జంటలు ఈ బాట పడుతున్నాయి. టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఉద్యోగాల పేరిట దూరదూర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అహం.. అపార్థం, అనుమానాలు.. ఒకరిపై ఒకరికి అపనమ్మకాలతో విభేదాలు వస్తున్నాయి. నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన బంధాలు చాలావరకు రోడ్డున పడుతున్నాయి. చిన్న సమస్య కూడా చివరికి పెద్ద గాలివానలా మారుతోంది. భార్య భర్తల మధ్య అగాధం పెరిగి చివరికి విడిపోయేందుకు సిద్ధమై పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి కూడా మూన్నాళ్ల్ల ముచ్చటగా తయారవుతోంది. క్షణికావేశంలో పంతాలకు పోయి బంధాలను తెంచుకుంటున్న దంపతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దంపతుల మధ్య విబేఽధాలు వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్యభర్తల మధ్య విబేధాలు వచ్చినప్పుడు వారి వారి తల్లిదండ్రులు రెండు వైపులా నచ్చచెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. అలా కాకుండా ఎక్కువ శాతం తల్లిదండ్రులు తమ పిల్లలనే రెచ్చగొడుతుండడంతో అనేక మంది తమ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుని విడిపోతున్నారు.

ప్రేమ వివాహాల పరిస్థితీ అంతే

ఏళ్ల తరబడి ప్రేమించుకోవడం, తరువాత పెద్దలు ఒప్పుకోలేదంటూ కొందరు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అనంతరం వారి జీవనానికి తగినంత సంపాదన లేకపోవడం, రాజీపడి జీవించలేకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారు చిన్నచిన్న ఘటనలకు కూడా పోలీసుస్టేషన్ల మెట్లు ఎక్కి, విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారు ఇటీవల ఎక్కువగా కనబడుతున్నారు.

మైనర్లు సైతం

కొంతమంది తల్లిదండ్రుల మధ్య తలెత్తుతున్న మనస్ఫర్థల కారణంగా పిల్లల పట్ల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో మైన ర్లు సైతం ప్రేమ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో చేస్తున్న తప్పుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులు విడిపోతుంటే.. మరికొందరు పిల్లలను వదులుకోలేక వారిని ఒక్కటి చేసేందుకు సరైన వయసు లేక ఆ కుటుంబం మానసిక వేదనకు గురవుతూ ‘నీకారణంగానే చెడిపోయారు’ అంటూ పరస్పరం తల్లీతండ్రీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కుటుంబ బంధాలు బీటలు వారేలా చేసుకుంటున్నారు.

కౌన్సెలింగ్‌ ద్వారా కలిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం

- వాసుదేవన్‌, దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ

చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న విభేదాల వల్ల వారిమధ్య దూరం పెరుగుతోంది. ఇద్దరి మధ్య క్షమాగుణం, సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే వారి జీవితం సాఫీగా సాగుతుంది. అవగాహన లోపంతో మూడుముళ్ల బంధాలు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ప్రస్తుతం పెళ్లయిన నెల రెండు నెలలకే కేసులు, విడాకుల కోసం పోలీసుస్టేషన్లకు రావడం బాధాకరం. ఇటీవల ప్రేమ వివాహాలు, కులాంత వివాహాలు చేసుకున్న వారినుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. కాలేజీకి వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. దిశ మహిళా పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును విచారించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. మాతో పాటు వన్‌స్టాప్‌ సెంటరు సిబ్బంది పెద్ద మనుషుల సమక్షంలో భార్యభర్తలను కలుపుతున్నాం. రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, అనుమానం లాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీరికి కూడా కౌన్సెలింగ్‌ ద్వారా అవగాహన కల్పించి భార్యాభర్తలను కలుపుతున్నాం. తరువాత కూడా ఆ దంపతులు ఎలా ఉండేది పరిశీలిస్తున్నాం.

2020 నుంచి ఇప్పటివరకు కేసుల వివరాలు

-------------------------------------------------------------------------------------------------

సంవత్సరం ఫిర్యాదులు కాంప్రమైజ్డ్‌ / కేసు రిజిస్టర్డ్‌ కేసు రిజిస్టర్డ్‌ పెండింగ్‌

కౌన్సెలింగ్‌ (ఇతర పీఎస్‌) (దిశ పీఎస్‌)

-------------------------------------------------------------------------------------------------

2020 308 జనరల్‌ 293 7 8 నిల్‌

245 సీసీసీ 242 3 0 నిల్‌

2021 926 జనరల్‌ 916 7 3 నిల్‌

296 సీసీసీ 288 6 2 నిల్‌

2022 525 జనరల్‌ 488 29 5 3

844 సీసీసీ 788 38 7 11

2023 87 జనరల్‌ 79 6 0 నిల్‌

164 సీసీసీ 136 3 3 22

-----------------------------------------------------------------------------------------------

Updated Date - 2023-03-02T23:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!