ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజోలి నీటి సామర్థ్యం తగ్గించరాదని ఎమ్మెల్సీ వినతి

ABN, First Publish Date - 2023-03-25T22:39:17+05:30

పెద్దముడియం మండలం రాజోలి ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ ప్రాంత రైతులతో కలిసి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ నారాయణరెడ్డిని కలిసి విన్నవించినట్లు తెలిపారు.

జలవనరుల శాఖ ఈఎన్‌సీతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జమ్మలమడుగు, మార్చి 25: పెద్దముడియం మండలం రాజోలి ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ ప్రాంత రైతులతో కలిసి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ నారాయణరెడ్డిని కలిసి విన్నవించినట్లు తెలిపారు. 2.95 టీఎంసీల నీటి సామర్థ్యం తో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న రాజో లి విషయంపై మాట్లాడి అక్కడున్న సమస్యలను వివరించామన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో భూమికి సంబంధించి సర్వే చేశారని తెలిపారు.

తమ ప్రాంతంలో నీటి సామర్థ్యం తగ్గిస్తున్నట్లుగా చర్చ జరుగుతుండడంతో ఎమ్మెల్సీని రైతు లు కలిసి ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని కోరిన ట్లు తెలిపారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించినట్లుగా రాజోలికి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మరికొందరు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising