ఉంగరాలపల్లెను వీడని చిరుత అలజడి
ABN, First Publish Date - 2023-08-22T23:24:52+05:30
ములకలచెరువు మండలం నాయనిచెరు వుపల్లె పంచాయతీ ఉంగరాలవారిపల్లెను చిరుతపులి అలజడి వీడడం లేదు.
ములకలచెరువు, ఆగస్టు 22: ములకలచెరువు మండలం నాయనిచెరు వుపల్లె పంచాయతీ ఉంగరాలవారిపల్లెను చిరుతపులి అలజడి వీడడం లేదు. మంగళవారం కూడా ఓ రైతు పొలంలో పాదముద్రలు కన్పించా యి. దీంతో మరోమారు చిరుతపులి అలజడి మొదలైంది. వచ్చింది చిరు త పులిగానే అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. ఈ క్రమంలో మంగళవారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సుధాకర్, గోపాల్‌లు జంతువుకు సంబంధించిన అనవాళ్ళు, వేలి ముద్రలు, ఇతర వివరాలు దొరుకుతాయోమోనని పరిశీలించారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను విచారించారు. గ్రామ సమీపంలో ఉన్న పెద్దతిప్పసముద్రం మండలం మిడిసానిపల్లె సమీపంలోని ఓ పొలం లో పలు చోట్ల ఉన్న జంతువు పాదముద్రలు కన్పించాయి. పాదముద్ర లను పరిశీలించిన అటవీశాఖ అధికారులు నిర్ధారణ కోసం ఉన్నతాధి కారులకు పంపారు. దీంతో బుధవారం అటవీశాఖ ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించనున్నారు.
Updated Date - 2023-08-22T23:24:52+05:30 IST