నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ABN, First Publish Date - 2023-04-02T23:06:40+05:30
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుం చి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి సిద్దం చేశామని ఆయా మండలాల ఎంఈఓలు ప్రకటించారు.
ఏర్పాట్లు పూర్తి
144 సెక్షన్ అమలు
రైల్వేకోడూరు(రూరల్)/సుండుపల్లె/చిన్నమం డెం, ఏప్రిల్2: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుం చి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి సిద్దం చేశామని ఆయా మండలాల ఎంఈఓలు ప్రకటించారు. సుండుపల్లె మండలం లో మూడు, చిన్నమండెంలో రెండు, రైల్వేకోడూ రులో ఐదు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిం చనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు నిర్వహిస్తారని, పరీక్షకు విద్యార్థులు 8.45 నిమిషాలకే హాజరు కావాలని అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాలకు వచ్చేం దుకు దూరప్రాంతీయులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్లను చూపితే ఉచితంగా ప్రయాణం చేయవ చ్చని ప్రభుత్వం ప్రకటించినట్లు అధికారులు తెలి పారు. పరీక్షా కేంద్రాల్లో టేబుల్స్, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తహసీల్దార్లు ప్రకటించారు.
రైల్వేకోడూరు జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్, గవర్నమెంట్, సెయింట్ మేరీ, హెచ్‌ఎంఎం హైస్కూల్, అనంతరాజుపేట జడ్పీహెచ్‌ఎస్‌ల లో కలిపి 1210 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈఓ పోతురాజు రామయ్య తెలిపారు. సుం డుపల్లె మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లల్లో కలిపి మూడు కేంద్రాల్లో 550 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నట్లు ఎంఈఓ వెంకటేశ్ నాయక్ తెలిపారు.
జడ్పీహైస్కూల్‌లో 200 మం ది, ప్రైమరీ గురుకుల ఉన్నత పాఠశాలలో 200 మంది, జీకేరాచపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో 150 మంది విద్యార్థులు పరీక్షలు రాయ నున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలి సి ఆదివారం పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ముగ్గురు చీఫ్‌లు, ముగ్గురు డిపార్టుమెంట్ అధికారులు, 26 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన తెలిపా రు.
చిన్నమండెం మండల కేంద్రంలో 400 మం ది విద్యార్థులు టెన్త్ పరీక్ష రాయనున్నట్లు ఎంఈ ఓ శివనాయక్ తెలిపారు. మండల కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఆయ న తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్‌లో 300 మం ది విద్యార్థులు, ఉర్దూ హైస్కూల్‌లో 100 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-04-02T23:06:40+05:30 IST