మహిళల్లో చైతన్యానికే టీడీపీ మహాశక్తి పథకం
ABN, First Publish Date - 2023-07-29T23:31:03+05:30
మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహాశక్తి పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నా రు.
మదనపల్లె టౌన, జూలై 29: మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహాశక్తి పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నా రు. శని వారం పట్టణంలోని గాంఽధీపురం వద్ద మహాశక్తి చైతన్య యాత్ర కార్యక్ర మంలో దొమ్మల పాటి పాల్గొని మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటోందన్నారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, పూర్ టు రిచ, ఇంటింటికి తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, అన్నదాత పథకంపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోందన్నారు. వచ్చే ప్రధాన మేనిఫెస్టోలో ఇంకా ప్రజాప్రయోజనాలు ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షు లు భవానిప్రసాద్, దేవరింటి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు రాధ, మహాలక్ష్మి, టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు విజయమ్మ, మైథిలి, ఉషారాణి, ప్రమీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన జగన
వాల్మీకిపురం, జూలై 29: రాయలసీమ ప్రాజె క్టులను సీఎం జగన పూర్తిగా నిర్లక్ష్యం చేశార ని వాల్మీకిపురం టీడీపీ మండలాధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, మాజీ జడ్పీటీసీ వల్లిగట్ల వెంకటరమణలు విమర్శించారు. శనివారం మండలంలోని చింతపర్తి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో సమావేశంలో జగన పోవాలి.. సీమలో సిరులు పండాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఒక్క జీవోతో సీమలో 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేశాడని, సీమ ప్రాజెక్టులపై అయిదేళ్లలో టీడీపీ రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.2011కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వ నిధులను పనులు చేయడానికి కాకుండా కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టడం తప్ప సాగునీటి ప్రాజెక్టుల ప్రాధా న్యత తెలియని జగన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి అన్నీ కూడా ఏదో చేసేస్తానన్న సీఎం జగన రాయలసీమ రైతులు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ విజయం సాఽధించి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ సింగల్‌విండో అధ్యక్షుడు ద్వారకనాథరెడ్డి, నాయ కులు కోసూరి చంద్రమౌళి, శేషాద్రిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, సదాశివరెడ్డి, శివ, రామ్‌మోహన, శీనా, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-29T23:31:03+05:30 IST