ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నులు వెంటనే తగ్గించి... న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2023-04-03T23:43:54+05:30

నాపరాయి పరిశ్రమపై కొత్తగా వేసిన పన్నులను వెంటనే తగ్గించి తమకు న్యాయం చేయాలని ఎర్రగుంట్ల నాపరాయి పరిశ్రమకు చెందిన యజమానులు సోమవారం గనులశాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజయవాడలో కలిసి విజ్ఞప్తి చేశారు.

మంత్రికి సమస్యలను విన్నవించుకుంటున్న నాపరాయి పరిశ్రమ యజమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడలో మంత్రికి విజ్ఞప్తి

ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 3: నాపరాయి పరిశ్రమపై కొత్తగా వేసిన పన్నులను వెంటనే తగ్గించి తమకు న్యాయం చేయాలని ఎర్రగుంట్ల నాపరాయి పరిశ్రమకు చెందిన యజమానులు సోమవారం గనులశాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజయవాడలో కలిసి విజ్ఞప్తి చేశారు. యజమానులు జక్కుచెన్నక్రిష్ణారెడ్డి, రాజారెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డితో కలిసి విజయవాడలో మరోసారి మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాయల్టీ వసూళ్లు ప్రైవేటు సంస్థకు అప్పగించి తమపై భారం వేయడం ద్వారా పరిశ్రమ ఇబ్బంది పడుతోందని వివరించినట్లు వారు తెలిపారు. రాయల్టీవసూళ్లు పాతపద్ధతిలోనే కొనసాగించాలని కోరామన్నారు. లేదంటే పరిశ్రమ మూతపడి వేలామంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించామన్నారు. ఇందుకు మంత్రి స్పందించి.. ఈవిషయంపై ఫైల్‌ తయారు చేయాలని ఓఎస్డీని ఆదేశించారని తెలిపారు.

Updated Date - 2023-04-03T23:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising