విద్యార్థులూ... మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు: డీఎస్పీ
ABN, First Publish Date - 2023-06-26T23:01:41+05:30
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్ విద్యార్థులకు సూచించారు.
పులివెందుల టౌన, జూన 26: మాదక ద్రవ్యాల జోలికి వెళ్లి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్‌ఈబీ అధికారి ప్రవీణ్‌కుమార్, అడిషనల్ ఎస్‌పీ సూచనల మేరకు పులివెందుల ఎస్‌ఈబీ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, లయోలా డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మత్తుపదార్థాలకు బానిసలైతే మీతో పాటు మీ కుటుంబం సమాజంలో తలెత్తుకోలేదన్నారు. మత్తుకు బానిసలై ఎంతో మంది తమ జీవితాలనునాశనం చేసుకున్నారన్నారు. దీనితో ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యారని తెలిపారు. కావున మంచి భవిష్యతను నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్‌ఐలు సత్యనారాయణ, హుస్సేన, లయోలా ప్రిన్సిపల్ అమల్‌రాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లీలాధర్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:01:41+05:30 IST