ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-01-24T23:36:48+05:30

బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులకు కఠిన చర్యలు తప్పవని సీపీడీవో పద్మావతి హెచ్చరించారు.

కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లు సీడీపీవో పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, జనవరి 24: బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులకు కఠిన చర్యలు తప్పవని సీపీడీవో పద్మావతి హెచ్చరించారు. జాతీయ బాలికల దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక కస్తూ ర్బా గురుకుల పాఠశాలలో బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల చదు వుల కోసం కస్తూర్బా, అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలున్నాయన్నారు. ఎస్‌ఐ వినోద్‌ మా ట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. సూపర్‌వైజర్లు అరుణమ్మ, తులస మ్మ, దాద్వి, ఎస్‌వో ఉమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కోనంపేట ప్రాథమిక పాఠశాలలో బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సిద్దయ్య మాట్లా డుతూ బాలికలు కలెక్టర్లు, ఎస్పీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, క్రీడాకారులుగా ఎదిగేలా ప్రోత్సహిం చాలన్నారు. హెచ్‌ఎం సుబ్బరాయుడు, సీహెచ్‌వో రవీంద్ర, రామచంద్ర, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సుండుపల్లె: ఆడపిల్లల్ని రక్షించి వారిని బాగా చదువనిద్దామని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగమణి తెలిపారు. మంగళవారం జీ. రెడ్డివారి పల్లె ప్రాథమిక పాఠశాలలో ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలను చదివిద్దాం.. వారిని రక్షిద్దాం అనే నినాదాలు చేశారు. బాల్యవివాహాలను పూర్తిగా ఆపాలని తెలియజేశారు. తల్లిదండ్రులు ఆడ పిల్లలను బాధ్యతగా చదివించి సమాజంలో గౌర వంగా బతికేలా చూడాలని కోరారు. ఈ కార్యర కమంలో అంగన్వాడీ కార్యకర్త సునీత, ఏఎన్‌ యం రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

పెనగలూరు : మండలంలోని పలు ఉన్నత పాఠ శాలల్లో హెడ్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందితో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ సంద ర్భంగా పెనగలూరు, నల్లపురెడ్డిపల్లె, చక్రంపేట, కట్టావారిపల్లె, శ్రీసాయి వికాస్‌, నాయుడువారి పల్లె ఉన్నత పాఠశాలల్లో బాలికలలతో ర్యాలీలు జరిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ మాస్టర్లు వెంకటరమణ, రమణయ్యశెట్టి, గోపాలకృష్ణ, అంగన్‌వాడీ కార్యకర్తలు, సబీరాభాను, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising