రూ.15లక్షల విలువైన వెండి నగలు పట్టివేత
ABN, First Publish Date - 2023-03-05T00:00:58+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్‌తో కలిసి శనివారం కూచివారిపల్లె చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో 21కిలోల వెండి నగలు పట్టుకున్నట్లు పట్ట ణ సీఐ నరసింహారావు తెలిపా రు.
రాజంపేట టౌన్, మార్చి4: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్‌తో కలిసి శనివారం కూచివారిపల్లె చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో 21కిలోల వెండి నగలు పట్టుకున్నట్లు పట్ట ణ సీఐ నరసింహారావు తెలిపా రు. శనివారం విలేకర్ల సమావే శంలో సీఐ మాట్లాడుతూ కలికిరి కి చెందిన రామచంద్రయ్య వస్తున్న కారును నిలిపి తనిఖీ చేయగా ఇంజన్‌లో 21కిలోల నగలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
వీటి విలువ సుమారు రూ. 15లక్షలు ఉంటుందన్నారు. నగలకు సరైన పత్రాలు చూపకపోవడంతో ఆయనను అదుపు లోకి తీసుకుని, కారును, వెండి నగలను స్వాధీనం చేసుకుని ఈఓఆర్‌డీ హరిప్రసాద్‌రెడ్డికి అప్పగించామన్నారు. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:00:58+05:30 IST