షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాలు దగ్ధం
ABN, First Publish Date - 2023-02-24T23:29:06+05:30
పార్నపల్లె రోడ్డులోని రాజారెడ్డికాలనీ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో ఓ సర్వీస్ సెంటర్, పక్కనే ఉన్న టిఫెన్ సెంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
పులివెందుల టౌన్, ఫిబ్రవరి 24: పార్నపల్లె రోడ్డులోని రాజారెడ్డికాలనీ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో ఓ సర్వీస్ సెంటర్, పక్కనే ఉన్న టిఫెన్ సెంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరా లిలా ఉన్నాయి. రాజారెడ్డి కాలనీ వద్ద రజియా టిఫెన్ సెంటర్, మాబాష సర్వీసింగ్ సెంటర్‌లు నడుపుకొంటున్నారు. రాత్రి షాపు మూసి ఇంటికెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మం టలు వ్యాపించాయి. సానికులు గమనించి అగ్నిమాపక సిబ్బంది కి ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేశారు. కానీ అప్పటికే సర్వీసింగ్ సెంటర్, టిఫెన్ సెంటర్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో దాదాపు రెండు లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు షాపుల యజమానులు తెలిపారు. ప్రభుత్వం సాయం చేయాలని వారు కోరారు.
Updated Date - 2023-02-24T23:29:07+05:30 IST