ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగులకు మెరుగైన సేవలందించండి

ABN, First Publish Date - 2023-02-21T23:01:04+05:30

ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ శ్యాక్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు.

సిబ్బందితో సమావేశమైన ఏపీ శ్యాక్స్‌ జేడీ సుబ్రహ్మణ్యంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో సిబ్బంది నియామకానికి చర్యలు

మందులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి

ఏపీ శ్యాక్స్‌ జేడీ సుబ్రహ్మణ్యంరెడ్డి

మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 21: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ శ్యాక్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ముఖ్యంగా ఏఆర్టీ, ఐసీటీసీ, క్షయ, రక్తనిధి కేంద్రాలను తనిఖీ చేసి మెడికల్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ఏఆర్టీ కేంద్రంలో సిబ్బంది కొరతతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదన్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోందన్నారు. హెచ్‌ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఏఆర్టీ కేంద్రంలో ఓపీ, టెస్టులు, మందుల కోసం వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. కొద్దిరోజులుగా వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో సేవల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. దీంతో హెచ్‌ఐవీ విస్తరిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో సిబ్బంది కొరతపై ఏపీ శ్యాక్స్‌కు ప్రతిపాదనలు పంపామని, త్వరలో నియామకానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్‌ఐవీ బాఽధితులకు హెపటైటి్‌స-బీ వ్యాక్సిన్‌ వేయాలని సూచించారు. ఐసీటీసీ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండి గర్భవతులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా తల్లీబిడ్డలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని లేకుంటే తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకే అవకాశం ఉందన్నారు. తల్లికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే బిడ్డకు సోకకుండా మందులతో కాపాడవచ్చని వివరించారు. తల్లికి వ్యాధి ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్నదే ఏపీ శ్యాక్స్‌ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. క్షయ అనుమానితులకు గళ్లపరీక్ష నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయాలన్నారు. పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు మందులు వాడాల్సి ఉందన్నారు. లేకుంటే జబ్బు ముదిరి మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. మందులతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే త్వరగా కోలుకుని వ్యాధి నుంచి బయటపడతారన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇంటిళ్లి పాదికి వ్యాపిస్తుందన్నారు. నెలకోసారి గళ్లపరీక్ష నిర్వహించి రోగిలో వ్యాధి తీవ్రతను గుర్తించాలన్నారు. ఆ ప్రకారం మందులు వాడితే క్షయ త్వరగా నయం అవుతుందన్నారు. క్షయ నివారణే ధ్యేయంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. రక్తనిధి కేంద్రంలో నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. విద్యా కేంద్రాల్లో రక్తనిధి శిబిరాలను ఏర్పాటు చేసి సేకరించాలన్నారు. వేసవిలో రక్తం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించాలన్నారు. అందుబాటులో ఉన్న రక్త నిల్వలను ఆపదలో ఉన్న రోగికి అందజేయాలన్నారు. సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే రోగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కేంద్రాల్లో మౌలిక వసతులు అందుబాటులో ఉండాలన్నారు. రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ఆయా కేంద్రాల రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ పద్మాంజలీదేవి, ఆర్‌ఎంవో దివాకర్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising