ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిస్వార్థ రాజకీయ నేత కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి

ABN, First Publish Date - 2023-08-03T23:19:02+05:30

నిస్వార్థ రాజకీయ నేత కామ్రే డ్‌, దివంగత నేత ఎద్దుల ఈశ్వరరెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మూలె వెంకటసుబ్బారెడ్డి అన్నారు.

ఈశ్వరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

జమ్మలమడుగు, ఆగస్టు 3: నిస్వార్థ రాజకీయ నేత కామ్రే డ్‌, దివంగత నేత ఎద్దుల ఈశ్వరరెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మూలె వెంకటసుబ్బారెడ్డి అన్నారు. గురువారం జమ్మలమడుగు పాత బస్టాండులో ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు మాట్లాడుతూ పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌ నినాదంతో కార్మిక, కర్షక, పీడిత ప్రజలకోసం పోరాడిన వ్యక్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి అన్నారు. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకాపెద్దపసుపులలో భూస్వామి కుటుంబంలో జన్మించారు. 600 ఎకరా ల భూమి, 12 కాండ్ల ఎద్దులున్నా హరిజన, గిరిజన ప్రజలకోసం, కార్మికుల హక్కులకోసం, రైతుల కోసం పోరాటా లు చేశారన్నారు. 1936లో డిగ్రీ పూర్తి చేశాసిన ఆయన బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన చరిత్ర ఉందన్నారు.

నాలుగుసార్లు కడ ప ఎంపీగాను, ఒకమారు ఎమ్మెల్సీగా పనిచేసిన ఘనత ఆయనదేనన్నారు. అప్పట్లో పుట్టపర్తి నారాయణాచార్యులు సైతం ఎద్దుల ఈశ్వరరెడ్డిని అన్నా అంటూ ఆప్యాయంగా పిలువడం చరిత్ర లో నిలిచిపోయిందన్నారు. 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని సీపీఐ కార్యాలయంలో తుది శ్వాస విడిచారన్నారు. ఆయనకు జ్ఞాపకార్థంగా గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వరరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేశారన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు సీపీఐ కార్యదర్శి ప్రసాద్‌, నాయకులు కృష్ణయ్య, మునిరెడ్డి, ధనుంజయ, చంద్ర, జయవర్ధన్‌, జగదీష్‌, ఎఐటీయూసీ నాయకులు రమేష్‌, హనుమంతు, గైబూసా, మాబాష, ప్రభాకర్‌, బెన్ని, ఎద్దుల జగదీశ్వరరెడ్డి, రమే్‌షరెడ్డి, లక్ష్మినారాయణ, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-03T23:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising