ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకుల భద్రతకు పెద్దపీట

ABN, First Publish Date - 2023-02-14T23:29:10+05:30

పర్యాటకుల భద్రతే ముఖ్యంగా హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ ఔట్‌పోస్టును ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో 26 టూరిస్ట్‌ పోలీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పోలీస్‌ అవుట్‌ పోస్టు ఆవరణంలో మొక్క నాటుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ ప్రారంభం

బి.కొత్తకోట, ఫిబ్రవరి 14 : పర్యాటకుల భద్రతే ముఖ్యంగా హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ ఔట్‌పోస్టును ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో 26 టూరిస్ట్‌ పోలీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆధునీకరించిన పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ను మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పోలీస్‌ అవుట్‌పోస్టు అవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యాటకుల భద్రతతో పాటు పర్యాటకులకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు ఈ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు షిఫ్టులుగా ఒక్కొక్క షిఫ్టుకు ఇద్దరు చొప్పున ఆరుగురు పోలీస్‌ సిబ్బందిని ఈ కేంద్రంలో నియమించినట్లు తెలిపారు. పర్యాటకులకు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా తగిన సహాయం అందించేందుకు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మదనపల్లె ఇన్‌చార్జ్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ శివాంజనేయులు, బి.కొత్తకోట, ముదివేడు ఎస్‌ఐలు రామ్మోహన్‌, సుకుమార్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T23:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising