ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునాది వేస్తున్నారంటూ రోడ్డు బ్లాక్‌

ABN, First Publish Date - 2023-03-25T22:43:06+05:30

అధికారులు చెప్పినా విన కుండా అక్రమంగా పునాదులు వేస్తున్నారంటూ మద్దే వాండ్లపల్లెలో గ్రామస్తులు ఆగ్రహించి గ్రామానికి ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు, మొద్దులు వేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు.

గ్రామస్తులతో మాట్లాడుతున్న అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి - రోడ్డును బ్లాక్‌ చేస్తూ కంపలు, రాళ్లు, మొద్దులు వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాయచోటిటౌన్‌, మార్చి25: అధికారులు చెప్పినా విన కుండా అక్రమంగా పునాదులు వేస్తున్నారంటూ మద్దే వాండ్లపల్లెలో గ్రామస్తులు ఆగ్రహించి గ్రామానికి ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు, మొద్దులు వేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. వివరా ల్లోకి వెళితే.. మాధవరం గ్రామం మద్దేవాండ్లపల్లె వాసులు రామయ్య, లక్ష్మయ్య అన్నదమ్ములు. జగన న్న లేఅవుట్‌ కింద ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో పునాదులు ప్రారంభించారు. అయితే గ్రామ స్తులంతా కలిసి ఆ స్థలం రోడ్డు అని, పూర్వం నుంచి అక్కడ రోడ్డు ఉందని, అక్కడ పునాదులు వేయకూడ దంటూ రెవెన్యూ అధికారులు, సచివాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. అయినా వారు అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో ఆగ్రహించిన గ్రామస్తులు శనివారం గ్రామానికి ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా కంపలు, రాళ్లు, మొద్దులు వేసి వాహనాలు తిరగకుం డా బ్లాక్‌ చేశారు.

విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని ముందుగా రోడ్డుకు అడ్డంగా వేసిన కంపలు, రాళ్లు, మొద్దులు తొలగించారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, రోడ్డు బ్లాక్‌ చేయడా నికి మీరెవరు, ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. దారి వెంట వెళ్లేవారు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరంటూ గ్రామస్తులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పునాదు లు వేస్తున్న ప్రాంతానికి వెళ్లి వీఆర్‌ఓతో కలిసి విచారించి పునాదులు వేస్తున్న ప్రాంతంలో అక్కడ పట్టాలు ఇచ్చారా లేదా అని ఆరా తీశారు. పునాదులు వేస్తున్న వారు జగనన్న లేఅవుట్‌ కింద ఇచ్చిన ఇంటి పట్టాలను చూపించడంతో వాటిని పరిశీలించిన అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకా రం పట్టా ఇచ్చినట్లు గుర్తించారు. పునాదులు వేస్తు న్న ప్రాంతానికి ముందు భాగంలో రోడ్డు కూడా అధికారులు ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ రోడ్డు వెంబడి వెళ్లవచ్చని సూచించారు.

దీంతో అర్బన్‌ సీఐ జోక్యంతో గ్రామంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించింది. అనంతరం గ్రామస్తులు గ్రామంలో మంచినీటి పథకం బోరు నుంచి కింది భాగంలో ఉన్న ఇండ్లకు నీరు సక్రమం గా రావడం లేదని ఆ సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

Updated Date - 2023-03-25T22:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising