ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో పునరుద్దరించండి

ABN, First Publish Date - 2023-03-30T22:49:39+05:30

భూస్వామి నుం చి నేను తీసుకున్న భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో నాపేరుతో ముటేషన్‌ పునరుద్దరించి వన్‌బీ మంజూరు చేయాలని ఓరైతు అధికారులను వేడుకుంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భూస్వాములకే వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అఽధికారులు

తన పేరిటఆన్‌లైన్‌లో వన్‌బీ నిలిపివేత

భూమిని ఆక్రమణ నుంచి కాపాడి ఆదుకోండి : బాధితుడి వేడుకోలు

పెద్దతిప్పసముద్రం మార్చి 30: భూస్వామి నుం చి నేను తీసుకున్న భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో నాపేరుతో ముటేషన్‌ పునరుద్దరించి వన్‌బీ మంజూరు చేయాలని ఓరైతు అధికారులను వేడుకుంటున్నాడు. బాధిత రైతు ఆంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీటీఎం మండలం టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లెకు చెందిన భూస్వామి రామకృష్ణారెడ్డి వద్ద తన తండ్రి చాకలి అక్కులప్ప చాకలి పని చేస్తు ఉండేవాడు. జీవనాధారం ఏమీ లేదని కొద్దిగా వ్యవసాయ భూమి ఇవ్వాలంటూ వేడుకోవడంతో అప్పట్లో గ్రామశివారులో సర్వేనంబర్‌ 960 -2ఎ లో 2.07 సెంట్లు, 961- 2లో 80 సెంట్ల భూమిని రామకృష్ణారెడ్డి తన తండ్రి అక్కులప్పకు అప్పగించాడని తెలిపారు. అయితే 2013లో ఆభూమి కి డబ్బు కట్టాలని డిమాండ్‌ చేయడంతో పెద్దల సమక్షంలో రూ.7.5 లక్షలు రామకృష్ణారెడ్డికి చెల్లించామని ఆంజనేయులు తెలిపాడు. భూమి రిజిస్టర్‌ కోసం సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాని వెళితే అది ఎల్సీపట్టా అని రిజిస్టర్‌ కాదని తెలిపారు.

దీంతో పెద్దమనుషుల సమక్షంలో రామకృష్ణారెడ్డి భూమికి పట్టా చేసుకు అనుభవించుకోమని తమకు తెలిపారన్నారు. అప్పటి నుంచి ఆ భూ మిని తామే వ్యవసా యం చేసుకుంటున్నామని ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లే న మోదయ్యాయని ఆం జనేయులు తెలిపా రు. రెండేళ్ల కిందట రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆయన వారసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంజనేయులు ఆవేదన వ్య క్తం చేస్తున్నాడు. రామకృష్ణారెడ్డి వారసులు ఉన్న త స్థాయిలో ఉండడంతో రెవెన్యూ అధికారులపై పలు విధాలుగా ఒత్తిళ్లు తెచ్చి భూమి తమదేనని నన్ను బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల కిందటి వరకు ఆ భూ ములకు సంబంధించి ఆన్‌లైన్‌లో నాపేరుతో వన్‌బీ రాకుండా నిలేపేశారని విలేఖరుల ఎదుట బోరున విలపించారు. రామకృష్ణారెడ్డి నుంచి మేము డబ్బు ఇచ్చి తీసుకున్న భూమిని ఆయన వారసులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని తాను పేదవాడినని ఎవరికి చెప్పాలో తెలియక, ఏమి చేయాలో దిక్కుతోచక ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చేయక పోతే కుటుం బ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశా డు. ఈ విషయమై తహసీల్దార్‌ విద్యాసాగర్‌ను వివరణ కోరగా ఆంజనేయులు వద్ద గల రికార్డు లు తీసుకోస్తే తన ఆవేదనపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-03-30T22:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising