ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధం

ABN, First Publish Date - 2023-03-25T22:05:36+05:30

దళిత క్రిస్లియన్లను ఎస్సీలుగా గుర్తించా లంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబీ ్లలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాజంపేట అసెంబ్లీ ఇనచార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు విమర్శించారు.

మాట్లాడుతున్న పోతుగుంట రమేష్‌నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజంపేట, మార్చి 25: దళిత క్రిస్లియన్లను ఎస్సీలుగా గుర్తించా లంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబీ ్లలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాజంపేట అసెంబ్లీ ఇనచార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు విమర్శించారు. శని వా రం రాజంపేట పట్టణంలోని బీజే పీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించడం ఎస్సీలకు అన్యాయం చేసినట్లు అవుతుందని, మత మార్పిడులకు ఇది ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ మన్నారు. దళితులు వేరు, క్రిస్టియన్లు వేరు అని, దళిత క్రిస్టియన్లు అని పేరు ముద్దుగా పెట్టి ఈ రోజు నిజమైన ఎస్సీల కోటాను విదేశీ మతస్తులకు కట్టబెట్టే ప్రయత్నమన్నారు. మత సంతుష్టీకరణ రాజకీయాలతో హిందువుల హక్కులు కాలరాస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యను సహించేది లేదన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జి.కె.నాగరాజు, కిసాన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పి.పాపయ్య, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు మాకం రవి, రాజంపేట బీజేపీ మండల ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రేణు ప్రసాద్‌రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సూర్యచంద్ర, బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising