ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
ABN, First Publish Date - 2023-08-20T23:47:11+05:30
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని ఆదివా రం పీలేరు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఘనంగా నిర్వహించారు.
పీలేరు, ఆగస్టు 20: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని ఆదివా రం పీలేరు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోటపల్లెలోని బీసీ బాలుర హాస్టల్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతికకు రాజీవ్ గాంధీ ఆద్యుడని తెలిపారు. అనంతరం హాస్టల్‌లో స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిసంపత కుమార్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన: మాజీప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుక లను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనం గా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీనాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా రు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రెడ్డిసాహె బ్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ, సుభిక్ష పరిపాలన వస్తోందని పేర్కొన్నారు. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేంద్రరెడ్డి, మహబూబ్‌పీర్, ఎస్‌ఎం రఫీ, నూర్‌అహ్మద్, చలపతి, మహమ్మద్‌అలీ, నాగరాజు, రిటైర్డ్ పోస్టల్ అధికారి చెన్నకేశవులు, మహమ్మద్, రజాక్,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-20T23:47:11+05:30 IST