ఆర్టీసీలో ఉద్యోగావకాశాలు కల్పించండి
ABN, First Publish Date - 2023-06-26T23:50:08+05:30
ఆర్టీసీలో అప్రెంటీ్‌స పూర్తిచేసి 12 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఉద్యోగం కోసం ఎదురూ చూడాల్సి రావడం బాధాకరంగా వుందని పలువురు అప్రెంటీ్‌సలు ఆవేదన వ్యక్తం చేశారు.
కడప (మారుతీనగర్) జూన 26: ఆర్టీసీలో అప్రెంటీ్‌స పూర్తిచేసి 12 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఉద్యోగం కోసం ఎదురూ చూడాల్సి రావడం బాధాకరంగా వుందని పలువురు అప్రెంటీ్‌సలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ డిపోలలో సుమారు 11 సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇంతవరకు ఆర్టీసీ నుంచి ఎటువంటి నోటిఫికేషన రాలేదన్నారు. దీంతో పలువురు అప్రెంటీస్ పూర్తి చేసిన నిరుద్యోగులు సోమవారం కలోక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ విజయ్‌రామరాజును కలిసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. కారుణ్య నియామకాలంటూ ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయడం తప్ప తమలాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ధ్యాసే ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మంది ఆర్టీసీలో అప్రెంటీ్‌సగా శిక్షణ పూర్తి చేసిన వారు వున్నారన్నారు. వీరిలో కొంతమందికి ఉద్యోగ వయస్సు కోల్పోయే స్థితికి చేరారని, ప్రభుత్వం స్పందించి శిక్షణ పూర్తిచేసిన అప్రెంటీ్‌సలకు న్యాయం జరిగేలా ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కె.షేక్షావలి, ఖాజామొహిద్దీన, రఫీ, జుబేర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-06-26T23:50:08+05:30 IST