పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోంది
ABN, First Publish Date - 2023-09-20T00:13:07+05:30
ఇసుక దోపిడీ, కాంట్రాక్టు పనుల తో డబ్బులు దోచుకుంటున్న మం త్రి పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమె త్తారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 19: ఇసుక దోపిడీ, కాంట్రాక్టు పనుల తో డబ్బులు దోచుకుంటున్న మం త్రి పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమె త్తారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ సాక్షాత్తు పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధు నరెడ్డి సహచర టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడును ఒరే కూర్చోరా అం టూ ఏకవచనంతో సంబోధించడం దారుణమన్నారు.ఈ ఘటనపై మిధున రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాధరణ, యువగళంలో లోకేశకు ప్రజాధరణ చూసి సీఎం జగన ఓర్చుకోలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ నవీనచౌదరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-20T00:13:07+05:30 IST