ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వవాహనంపై పట్టాభిరాముడి వైభవం

ABN, First Publish Date - 2023-04-03T23:39:04+05:30

వాల్మీకిపురం పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహనంపై పట్టాభిరాముడి ఊరేగింపు, పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

అశ్వ వాహనంపై సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముడి నగరోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేడుకగా పార్వేట ఉత్సవం

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 3: వాల్మీకిపురం పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహనంపై పట్టాభిరాముడి ఊరేగింపు, పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆలయంలోని మూలవర్లకు అభిషేకం, తోమాలసేవలతో విశేష పూజలు జరిగాయి. భోగోత్సవమూర్తులైన సీతారామలక్ష్మణులకు విశేష అలంకరణలతో తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ మండపంలో యాగశాల వైదిక కార్యక్రమాలు సాగాయి. సాయంత్రం పట్టాభిరాముడికి ఊంజల్‌సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక పార్వేట మండపం వద్ద ఉత్సవ వేడుకలు నిర్వహిస్తూ భక్తులకు విశిష్టతను తెలియజేశారు. అనంతరం రాత్రికి అశ్వవాహనంపై పట్టాభిరాముడిని విశేషాలంకరణలతో అధిష్టింప చేసి పురవీధులలో నిర్వహించిన నగరోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా కోలాటలు, చెక్కభజనలు, మహిళల చలిపిండి దీపారాధనలు, టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రికి హంసవాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాలలో టీటీడీ అధికారులతో పాటు ఆలయ పండితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising