పేదలపై మరోసారి బాదుడు
ABN, First Publish Date - 2023-06-07T23:35:36+05:30
పేద ప్రజలపై పెత్తందారుల ప్రభుత్వం మరోసారి కరెంటు ట్రూ అప్‌చార్జీల పేరుతో రూ.2.5 కోట్లు భారం వేసిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీబాషా, టీఎన్‌ఎ్‌సఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ ఆరోపించారు.
ట్రూఅప్ చార్జీల పట్ల టీడీపీ నేత వికా్‌స హరిక్రిష్ణ ధ్వజం
్జకడప (ఎర్రముక్కపల్లె), జూన్ 7: పేద ప్రజలపై పెత్తందారుల ప్రభుత్వం మరోసారి కరెంటు ట్రూ అప్‌చార్జీల పేరుతో రూ.2.5 కోట్లు భారం వేసిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీబాషా, టీఎన్‌ఎ్‌సఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ ఆరోపించారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎనిమిదోసారి ట్రూఅఫ్ చార్జీల పేరుతో మరో బాదుడుకు శ్రీకారం చుట్టిందన్నారు.
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో సతమతమవుతున్న పేదలపై పెంచిన కరెంటు చార్జ్జీలు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లుల్లో దేనికి చెల్లించా లో కూడా తెలపకుండా ప్రజలను గుడ్డివారిని చేస్తున్నారని, ఇది పెత్తందారి వ్యవస్థకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు, శివరాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T23:35:36+05:30 IST