ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలి:ఫ్యాప్టో

ABN, First Publish Date - 2023-09-22T23:23:51+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్‌ అమలును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రమణయ్య, సీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ రమణమూర్తి కోరారు.

పుల్లంపేట: నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

పుల్లంపేట, సెప్టెంబరు22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్‌ అమలును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రమణయ్య, సీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ రమణమూర్తి కోరారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం మండల పరిధిలోని టి.కమ్మపల్లె ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యా హ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు సత్తాజ్‌ హుస్సేన్‌, బాలనరసింములు మాట్లాడుతూ సీపీఎస్‌కు బదులు జీపీఎస్‌ అమలు చేయడం ప్రభుత్వపు దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం ప్రకటి స్తున్న జీపీఎస్‌ విధానం గ్యారెంటీ లేని పెన్షన్‌ విధాన మని, ఇది సీపీఎస్‌కు ప్రతిరూపం తప్ప దీని వల్ల ఉ ద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపయోగం లేద న్నారు. ప్రభుత్వం మొండిగా జీపీఎస్‌ను అమలు చే యడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపా ధ్యాయుల మనోభావాలను పెడచెవిన పెట్టి జీపీఎస్‌ అమలు చేయడం వల్ల తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బబిత, ఉపాధ్యాయులు శామ్యూల్‌బాషా, ఆసిఫ్‌; శేషాద్రి, విశ్వనాధ్‌, వెంకటేశ్వ ర్లు నరసయ్య పాల్గొన్నారు.

రాజంపేట: జీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ ఫ్యాప్టో కడప జిల్లా భాగస్వామ్య సంఘం బీటీఏ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ హరికొండయ్య ఆధ్వర్యంలో హైస్కూలు ఉపాఽధ్యాయినీ, ఉపాధ్యాయు లు, బోధనేతర సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ ముద్దు, జీపీఎస్‌ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట: పెన్నపేరూరు ప్రాఽథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యా డ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు మాట్లాడుతూ సీపీఎస్‌కు బదులు జీపీఎస్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గమైన చర్య గా అభివర్ణించారు. హెచ్‌ఎం నారాయణరెడ్డి, ఉపాధ్యా యులు మహబూబ్‌ ఖాన్‌, షీలా కుమారి, హెలెన్‌ మంజుల అనురాధ, సుజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising