ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Shilpa Ravi: మా ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ..

ABN, First Publish Date - 2023-02-05T12:17:54+05:30

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Former Minister Bhuma Akhilapriya) సవాల్‎కు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Former Minister Bhuma Akhilapriya) సవాల్‎కు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి(Nandyala MLA Shilpa Ravichandrakishor Reddy) కౌంటర్ విసిరారు. శనివారం మీడియా సమావేశంలో అఖిలప్రియ మాట్లాడిన తీరు బయటపడిందన్నారు. ఆదివారం శిల్పా రవి మీడియాతో మాట్లాడుతూ..మెడికల్ కాలేజీ (Medical College) వస్తుందని 50 ఎకరాలు ఇన్‎సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. మాకు ఉన్నది 30 ఎకరాలు మిగతా 20 ఎకరాలు ఎవరైనా తీసుకోవచ్చన్నారు. 50 ఎకరాలు కమర్షియల్ చేశారన్నది అవాస్తవం..ఉన్న 30 ఎకరాలు కూడా ఒకే దగ్గర లేదని తెలిపారు. మా నాన్న ఎలక్షన్ అఫిడవిట్(Election Affidavit) చెక్ చేసుకోవచ్చన్నారు. ‘‘హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతాల్లో మేము భూమి కొన్నాం..మా ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ.కందుకూరులో మీరు 200 ఎకరాలు కొన్నారు. మీ ఆస్తుల విలువ పెరిగితే మేము బాధపడుతున్నామా?. ఎదుటివారిపై ఈర్ష పడటం కంటే వాస్తవాలు తెలుసుకోండి’’ అంటూ అఖిలప్రియ తీరు హాస్యస్పదంగా ఉందన్నారు. అయితే..అఖిలప్రియ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని శిల్పా రవి అన్నారు.

అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు..

శిల్పా రవిచంద్రకిషోర్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. 4న నంద్యాలలోని గాంధీచౌక్ వద్దకు ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకువస్తానని... తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని, లేదంటూ క్షమాపణ చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-05T12:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising