ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీ పాలసీదారుల సొమ్ము భద్రం

ABN, First Publish Date - 2023-02-06T22:32:38+05:30

అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్‌ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 6 : అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్‌ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. నష్టం ఊహాత్మకమైనదే తప్ప నిజమైనది కాదన్నారు. పాలసీదారులకు లాభాలు పంచాలంటే ఈ నిధులను గాలికి వదిలేయడం కుదరదని, వాటిలో కొంత మేర బ్లూచిప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సిందేనన్నారు. ఐఆర్‌డీఏ నిబంధనలకు లోబడే ఎల్‌ఐసీ అదాని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టిందన్నారు. గతంలో కూడా ఏఎన్జీసీ షేర్లు, ఐసీబీఐ బ్యాంకు షేర్లు కొన్నప్పుడు కొందరు తప్పు పట్టారని, కానీ ఎల్‌ఐసీ ఓఎన్జీసీ షేర్లు కొని లాభాలు సాఽధించిందని గుర్తు చేశారు. ఎల్‌ఐసీ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే మదుపరి సంస్థ అన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. అందువల్ల ఎల్‌ఐసీలో ప్రజల పెట్టుబడులు సంపూర్ణంగా సురక్షితమైనవేనని రఘునాథరెడ్డి వివరించారు.

Updated Date - 2023-02-06T22:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising