రాషా్ట్రన్ని రక్షించుకుందాం
ABN, First Publish Date - 2023-08-02T00:06:36+05:30
రాషా్ట్రన్ని నిరంకుశ పాలన నుంచి రక్షించుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు పిలుపునిచ్చారు.
మోదీ, జగన్ నిరంకుశ పాలనను పారదోలాలి
17 నుంచి సెప్టెంబరు 8 వరకు సీపీఐ బస్సు యాత్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు
కడప(సెవెన్‌రోడ్స్), ఆగస్టు 1: రాషా్ట్రన్ని నిరంకుశ పాలన నుంచి రక్షించుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు పిలుపునిచ్చారు. మంగళ వారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ, జగన్ పాలన అన్నిరంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమి బహుళ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారన్నారు. చివరికి న్యాయవ్యవస్థపై కూడా పెత్తనం చెలాయించేందుకు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్ కూల్చివేతలకు, కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్నారు. రాషా్ట్రనికి అడుగడుగునా మోసం, ద్రోహం చేసిన కేంద్ర బీజేపీ పాలనకు ఊడిగం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. తాను ఇచ్చిన హామీలను, చేసిన జీఓలను అమలు చేయాలని కోరే వారిపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. 11వ పీఆర్సీ ద్వారా 13.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ఇతర రంగాల్లోని కార్మికులపై కత్తి కట్టారన్నారు. వరదలతో, వర్షాభావంతో నష్టపోతున్న రైతులను పట్టించుకునే ఓపిక తీరిక సీఎం జగనకు లేదన్నారు. పోలవరం ఎత్తు 41.5 మీటర్లకు తగ్గించడం ద్వారా రాయలసీమ ప్రయోజనాలకు శాశ్వతంగా గండి కొట్టడానికి సిద్ధపడడం చూస్తే ఇంత చేతగాని సీఎం ఎవరూ లేరన్నారు. మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. పెట్రో ధరలు పొరుగు రాషా్ట్రల్లో మన కంటే రూ.8, 10 తక్కువగా ఉన్నాయన్నారు. అప్పుల మీద అప్పు తేవాలి, ఓట్ల కోసం బటన్ నొక్కాలనే సిద్ధాంతంతో పాలన చేస్తున్న జగన్ చెర నుంచి రాషా్ట్రన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 8 వరకు బస్సు యాత్ర ద్వారా సీపీఐ ప్రచార జాత నిర్వహిస్తుందన్నారు. ఈ బస్సు యాత్ర ఆగస్టు 17న విశాఖలో ప్రారంభమై సెప్టెంబరు 8న తిరుపతిలో భారీ బహిరంగసభతో ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గసభ్యులు ఎల్.నాగసుబ్బారెడ్డి, కె.ఆంజనేయులు, ఎంవీ సుబ్బారెడ్డి, ఎన్.వెంకటశివ, బషీరున్నీసా, చంద్రశేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:06:36+05:30 IST