ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేశ పాదయాత్రను దిగ్విజయం చేద్దాం

ABN, First Publish Date - 2023-03-02T23:09:17+05:30

మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టనున్న యువ గళం పాదయాత్రను దిగ్విజయం చేద్దామ ని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎ మ్మెల్యే దొమ్మలపాటి రమేశ పిలుపునిచ్చా రు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మదనపల్లె టౌన, మార్చి 2: మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టనున్న యువ గళం పాదయాత్రను దిగ్విజయం చేద్దామ ని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎ మ్మెల్యే దొమ్మలపాటి రమేశ పిలుపునిచ్చా రు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయం లో మదనపల్లె పట్టణ, మండల టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ మాట్లాడుతూ లోకేశ పాదయాత్ర పీలేరు నియోజకవర్గం నుంచి 8వ తేది మదనపల్లె నియోజకవర్గంలోని కాశీరావుపేటకు చేరుకుంటుందన్నారు. అక్క డ విడిది చేశాక, 9, 10 తేదీల్లో సీటీఎం, మదనపల్లె పట్టణంలో పాదయాత్ర ఉంటుం దన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణంలోని టీడీపీ నాయకులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జిలు పెద్దసంఖ్యలో పాదయాత్రకు తరలిరావాలన్నారు. అలాగే ఈనెల 13వ తేదిన నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరు స్తున్న కంచర్ల శ్రీకాంత గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. సమావే శంలో పట్టణ, మండల అధ్యక్షులు భవానిప్రసాద్‌, శ్రీనివాసులు, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ, తదితరులు పాల్గొన్నారు.

కురబలకోటలో: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ చేపడుతున్న యువ గళం పాదయాత్ర శుక్రవారం రాజంపేట నియోజకవర్గానికి చేరుకోనున్నందున ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్య క్షుడు పి.సురేంద్రయాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అంగళ్లులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3నుంచి 17వరకు పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాలలో పాదయాత్ర సాగుతుందని, అనంతరం సత్యసాయి జిల్లాకు చేరుకుంటుందన్నారు. ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుండటంతో వైసీపీ నేతల్లో భయం మొదలైం దన్నారు. ఆయన పర్యటనకు యువత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2023-03-02T23:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!