లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేద్దాం
ABN, First Publish Date - 2023-06-07T23:32:51+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
పోరుమామిళ్ల, జూన్ 7 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన అట్లూరు మండలంలో ప్రవేశిస్తున్న సందర్భంగా జరుగుతున్న యువగళం పాదయాత్ర కార్యక్రమాలను జయప్రదం చేయాల న్నారు. బుధవారం మండలంలోని వసుంధర కల్యాణ మండపంలో టీడీపీ మండల ఇన్‌చార్జి భైరవ ప్రసాద్ అధ్యక్షతన పోరుమామిళ్ల, కాశనాయన, కలసపాడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నపాయాత్ర విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకులపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు తెలుసుకోవడం కోసమే ఆయన పాదయాత్ర చేస్తున్నారని, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేయాలన్న తలంపుతో ఈ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీకి సైనికుల్లాంటి కార్యకర్తలు ఉన్నారన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు,నాయకులు గటి ్ట కృషి వల్ల రాబోవు ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించి అధికారం చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్నారు. నియోజకవర్గంలో అందరి కృషి, పట్టుదలతో ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు. టీడీపీ మండల ఇన్‌చార్జి భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మేజరు పంచాయితీ సర్పంచ్ యనమల సుధాకర్, టీడీపీ నాయకులు కొండా రామక్రిష్ణారెడ్డి, చెరుకూరు రవికుమార్, సీనియర్ నాయకుడు సీతా వెంకటసుబ్బయ్య, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ చెరుకూరి చెన్నరాయుడు, పోరుమామిళ్ల మండల తెలుగు యువత అధ్యక్షుడు సీతా బాలాజీ, పట్టణ అధ్యక్షుడు మస్తాన్‌వలి, సీనియర్ నాయకులు రామసుబ్బారావు, మల్లికార్జునరెడ్డి, ఇమాంహుస్సేన్, శెట్టెంప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ వైస్ ఛైర్మన్ మహబూబ్‌బాషా (బిజ్జె), తోకలపల్లె టీడీపీ నాయకులు నాగభూషణం, మేడిశెట్టి వెంకటేశ్వర్లు, షరీఫ్, కలసపాడు మండల టీడీపీ నాయకుడు సాదనకారి రంతు, టీడీపీ ఇన్‌చార్జి వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకుడు నాగేశ్వర్‌రావు, కాశినాయన నుంచి రాజారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్విరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, దమ్మనపల్లె యువ నాయకులు తోట జనార్దన్, మూడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Updated Date - 2023-06-07T23:33:04+05:30 IST