ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం

ABN, First Publish Date - 2023-01-24T23:28:55+05:30

వైసీపీ పాలనతో అస్తవ్యస్తంగా మారిన పాలన గాడిలో పడాలం టే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్య మంత్రిని చేసుకోవాలని రాయచోటి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

‘ఇదేం ఖర్మ రాష్ర్టానికి’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, జనవరి 24: వైసీపీ పాలనతో అస్తవ్యస్తంగా మారిన పాలన గాడిలో పడాలం టే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్య మంత్రిని చేసుకోవాలని రాయచోటి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళ వారం పట్టణంలోని 10వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మా ట్లాడుతూ రాయచోటిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అక్రమాలు, అరాచకాలు పెరిగిపో యాయన్నారు. పట్టణ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను కమిషన్ల కోసం దారి మళ్లించి, ఆదా యం వచ్చే చోట పనులు చేస్తున్నారని ఆరోపిం చారు. పట్టణంలో అండర్‌ డ్రైనేజీ పనులు పట్ట ణంలో చేయకుండా చుట్టుపక్కల వెంచర్లలో చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలు తీరా లంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ము ఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అద్యక్షులు బోనమల ఖాదర్‌వలి, రూరల్‌ ఽఅధ్యక్షుడు మురికి నాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి వతన్‌నిస్సార్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ ఎస్‌కే హుస్సేన్‌, పట్టణ మైనార్టీ అధ్య క్షుడు అతా వుల్లా, టీడీపీ నేతలు లక్ష్మిప్రసాద్‌, సాయిప్రతాప్‌, జాబీర్‌, మహబూబ్‌అలీఖాన్‌, సత్యారెడ్డి, రవీంద్రనాయుడు, బాబురెడ్డి, అబు జర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising