విధి నిర్వహణలో అలసత్వం సహించం : ఎండీ
ABN, First Publish Date - 2023-06-07T00:19:31+05:30
విధి నిర్వహణలో ఉద్యోగులు అలసత్వం వహిస్తే సహించేది లేదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ చైర్మన్ అండ్ ఎండీ సంతో్‌షరావు హెచ్చరించారు. విద్యుత్‌సరఫరాలో ఎటువంటి జాప్యం చేయవద్దని సూచించారు.
కడప(ఎర్రముక్కపల్లె), జూన్ 6: విధి నిర్వహణలో ఉద్యోగులు అలసత్వం వహిస్తే సహించేది లేదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ చైర్మన్ అండ్ ఎండీ సంతో్‌షరావు హెచ్చరించారు. విద్యుత్‌సరఫరాలో ఎటువంటి జాప్యం చేయవద్దని సూచించారు. వ్యవసాయ సర్వీసులు త్వరితగతిన మంజూరు చేసి బిగించాలని తెలిపారు. మంగళవారం కడప నగరం ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జిల్లా విద్యుత్ అఽధికారి అధ్యక్షతనసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 12,551 వ్యవసాయ సర్వీసులు విడుదల చేస్తున్నందుకు అధికారులను అభినందించారు. వ్యవసాయ సర్వీసులను త్వరగా విడుదల చేయడం వల్ల సంస్థకు మేలు జరుగుతుందని చెప్పారు.. సిబ్బందికి సంస్థ సేఫ్టీ బెల్టు, విద్యుత్ ప్రవాహం తెలుసుకునేందుకు టెస్టరు, రబ్బరు తొడుగులు తదితర పరికరాలు ఇచ్చిందదన్నారు. పనులు చేసేటప్పుడు సిబ్బంది వాటిని తప్పక వినియోగించాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయని, వాటి వసూలుపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టరు శివప్రసాద్‌రెడ్డి, ఓఎస్డీ ఎన్.శ్రీనివాసులు, చీఫ్ జనరల్ మేనేజరు ధర్మ, గురవయ్య, సూపరింటెండెంట్ ఇంజనీరు రమణ, ఉమ్మడి జిల్లాల అకౌంటు అధికారి మధు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈలు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T00:19:31+05:30 IST