ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సమస్యలు పరిష్కరించాలి : జేసీ

ABN, First Publish Date - 2023-06-07T23:34:55+05:30

భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జేసీ గణేశ్‌కుమార్‌ తెలిపారు. బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.

బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయంలో సిబ్బందితో జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మంగారిమఠం, జూన్‌ 7 : భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జేసీ గణేశ్‌కుమార్‌ తెలిపారు. బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈయన వెంట బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకటరమణ ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పునర్నిర్మాణ పనులు చేస్తున్న తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించి భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. అలాగే భూసర్వేను వేగవంతం చేయాలని తెలిపారు. ఈయన వెంట తహసీల్దారు ఈశ్వరయ్య, రెవెన్యూసిబ్బంది, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

కాశినాయన..: రెవెన్యూ కార్యాలయ నిర్వహణతోపాటు దాని చుట్టూఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ గణేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం నర్సాపురం తహసీల్దారు కార్యాలయాన్ని బద్వేల్‌ ఆర్డీవో ఆకుల వెంకటరమణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.రికార్డులు భద్రపరిచేగది, కంప్యూటర్‌ రూములను పరిశీలించారు. అనంతరం భూసర్వే పనుల పురోగతిని తహసీల్దారు రామచంద్రుడిని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు కార్యాలయ మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Updated Date - 2023-06-07T23:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising