ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ సెక్రటరీగా కొనిశెట్టి విశ్వనాధ్‌

ABN, First Publish Date - 2023-03-05T23:48:06+05:30

నందలూరు రైల్వే కేంద్రంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఎన్నికలలో సెక్రటరీగా కొనిశెట్టి విశ్వనాఽథ్‌ విజయం సాధించారు.

సంబరాలు చేసుకుంటున్నమజ్దూర్‌ యూనియన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నందలూరు, మార్చి5 : నందలూరు రైల్వే కేంద్రంలో ఆదివారం హోరాహోరీగా జరిగిన రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఎన్నికలలో సెక్రటరీగా కొనిశెట్టి విశ్వనాఽథ్‌ విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా శ్రీహర్ష, కోశాధికారిగా మోర్త శ్రీనివాసులు తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. మొత్తం 322 ఓట్లకు 263 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశ్వనాఽథ్‌ 174 ఓట్లను సాధించి తమ సమీప ప్రత్యర్ధి పీఈకే మూర్తిపై 85 ఓట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. శ్రీహర్ష 148, మోర్తా శ్రీనివాసులు 170 సంపాదించారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డైరెక్టర్ల స్థానలాలన్నింటినీ గెలుచుకుంది. కమిటీ మెంబర్లుగా కె.రాజా, జంగం వంశీ, ఎస్‌.కె.అబ్దుల్లా రౌఫ్‌, టి.బాలసుబ్రహ్మణ్యం, షేక్‌ మహమ్మద్‌ గౌస్‌, ఎస్‌.నరసింహులు విజయం సాధించారు. నాలుగు గంటలకు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ బచ్చు జయభాస్కర్‌రావు ఆధ్వర్యంలో కౌంటింగ్‌ నిర్వహించారు. విజయం సాధించిన మజ్దూర్‌ యూనియన్‌ ప్యానల్‌ సంబరాలు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కడప రైల్వే జీఆర్పీఎస్‌ఐ విజయ నరసింహులు, స్థానిక ఏఎస్‌ఐ సుబ్బరాయుడు, ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ భరత్‌ కుమార్‌ రెడ్డి గట్టి బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో హెడ్‌కానిస్టేబుల్‌ రహీం, షామీర్‌ బాషా, జిఆర్‌పి హెడ్‌ కానిస్టేబుల్‌ సుభాన్‌ బాష,ఆ కానిస్టేబుల్‌ నాగయ్య, ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌, శ్రీనివాసరావు, ఎంసిఆర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising