ఖరీఫ్ ‘బూడిద’ పాలు
ABN, First Publish Date - 2023-09-21T23:36:19+05:30
ఖరీఫ్, రబీ సీజన్‌లో వేరుశనగ పంట, కంది, వరి, సజ్జ, టమోట, వం టి సాధారణ పంటలు సాగు చేసేవారు. పంట సాగు చేసినా అతివృష్టి, అనావృష్టి, వివిధ రకాల తెగుళ్లతో పంట చేతికందక చివరికి అప్పులే మిగి లేవని రైతులు ఆవేదన చెందేవారు.
ఆరుగాలం కష్టపడినా అప్పులే
నష్టాల్లో బూడిద గుమ్మడి రైతులు
లక్కిరెడ్డిపల్లె,సెప్టెంబరు21: ఖరీఫ్, రబీ సీజన్‌లో వేరుశనగ పంట, కంది, వరి, సజ్జ, టమోట, వం టి సాధారణ పంటలు సాగు చేసేవారు. పంట సాగు చేసినా అతివృష్టి, అనావృష్టి, వివిధ రకాల తెగుళ్లతో పంట చేతికందక చివరికి అప్పులే మిగి లేవని రైతులు ఆవేదన చెందేవారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మండలం లో బోర్ల కింద బూడిదగుంటపల్లె, దేవళంపల్లె, పాళెం మామిడిగారిపల్లె గ్రామాల్లో బూడిద గుమ్మడికాయ పంట సాగుచేశారు. 70 రోజుల్లో దిగుబడులు వస్తాయని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగుచేశారు. పంట ఆశాజకంగా ఉం దని రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తీరా పంట చేతికందే సమయంలో ధర డమాల్ అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు లు పద్మావతమ్మ, వెంకటసుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో కొత్త పంటగా బూడిద గుమ్మడి కాయసాగు చేశారు. గుమ్మడికాయ కొనాలంటే రూ.60 నుంచి రూ.100 వరనకు అమ్ముతున్నారు.
ఎకరాల్లో పంట సాగు చేసి మార్కెట్‌కు తరలిస్తే కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదనం చెందుతున్నా రు. కాయలు కోయడానికి ఒక్కో కూలీకి రూ. 350 ఇవ్వాల్సి వస్తోంది. రూ. 10 వేలు ఖర్చు పెట్టి చైన్నై, బెంగుళూరుకు తీసుకెళితే టన్ను బూ డిద గుమ్మడికాయలు రూ. 20వేలకు అడుగుతు న్నారని మనసు చంపుకొని ఇంటికి తీసుకురాలేక అక్కడే అడిగినంతకు అమ్ముకున్నామని రైతులు వాపోతున్నారు. దళారులు 20 వేలకు అడుగుతు న్నా మార్కెట్‌లో కాయ కొనాలంటే రూ. 70 అమ్ముతున్నారని రైతు నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తున్నారని రైతులు విరిస్తున్నారు. ఎకరాకు రూ. 50 నుంచి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టినా చివరికి కూల్లు కూడా ఎల్లడం లేదని రైతులు వాపోతున్నారు. సాగు చేసినా చి వరికి మిగిలేది అప్పులేనని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-21T23:36:19+05:30 IST