ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కమనీయం.. సీతారాముల శాంతి కల్యాణం

ABN, First Publish Date - 2023-08-22T23:20:57+05:30

వాల్మీకిపురం పట్టాభిరాముడి రామాలయంలో రాముడి పట్టాభిషేక మహోత్సవాలలో భాగంగా మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలో కమనీ యంగా శాంతి కల్యాణం నిర్వహించారు.

హనుమత వాహనంపై ఊరేగుతున్న సీతాలక్ష్మణులు

వాల్మీకిపురం, ఆగస్టు 22: వాల్మీకిపురం పట్టాభిరాముడి రామాలయంలో రాముడి పట్టాభిషేక మహోత్సవాలలో భాగంగా మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలో కమనీ యంగా శాంతి కల్యాణం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ మొదలు మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాల సేవలతో ప్రత్యేక పూజలు జరిగాయు. భోగోత్సవ మూర్తులైన సీతారామలక్ష్మణులకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ స్నపన తిరుమంజనం గావించి విశేష పుష్పాలంకరణలు చేసి విశేష భక్తజనం నడుమ సీతారాముల శాంతి కల్యాణం కమనీయంగా సాగింది. అనం తరం రాత్రికి సీతాలక్ష్మణ సమేతుడైన పట్టాభిరాముడిని హనుమత వాహ నంపై విశేష అలంకరణలు చేసి పురవీధులలో నగరోత్సవం నిర్వహించారు. చివరగా ఏకాంత సేవ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెం డెంట్‌ మునిచెంగల్రాయులు, ఆలయ అధికారులు కృష్ణమూర్తి, నాగరాజు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

నేడు రాముడడి పట్టాభిషేకం: రాముడి పట్టాభిషేక మహోత్సవాలలో భాగం గా చివరిరోజు బుధవారం ఉదయం స్నపన తిరుమంజనం, రాముడి పట్టాభిషే కం నిర్వహించనున్నారు. సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రికి గరుడవాహనంపై రాముడి నగరోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated Date - 2023-08-22T23:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising