తెలుగుగంగ ప్రాజెక్టును పరిశీలించిన జేసీ
ABN, First Publish Date - 2023-01-13T23:01:12+05:30
మండల పరిధిలోని చల్లబసాయిపల్లె వద్ద ఉన్న ఎస్‌ఆర్-1 తెలుగుగంగ జలాశయాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపలె ్ల రఘురామిరెడ్డి పరిశీలించారు.
దువ్వూరు, జనవరి 13: మండల పరిధిలోని చల్లబసాయిపల్లె వద్ద ఉన్న ఎస్‌ఆర్-1 తెలుగుగంగ జలాశయాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపలె ్ల రఘురామిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం గేట్ల మరమ్మతులు, డ్యాంకు అవసరమయ్యే నిధులకు సంబంధించి, ఆయకట్టు కాలువల నిర్మాణం కోసం తెలుగుగంగ ఎస్‌ఈ శారదతో చర్చించారు. రైతులకు పూర్తి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టే పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో తెలుగంగ ఈఈ బాలాజీ, డీఈలు ప్రసాద్, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సంగన లక్ష్మినారాయణరెడ్డి, సంగన హరిహరనాథరెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, తెలుగుగంగ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-13T23:01:16+05:30 IST