ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ ఓట్లను గుర్తించాలి

ABN, First Publish Date - 2023-07-21T23:47:40+05:30

ప్రతి ఇల్లు సర్వే చేసి అక్రమ ఓట్లను గుర్తించాలని కడప టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అమీర్‌బాబు

టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు

కడప (ఎర్రముక్కపల్లె), జూలై 21 : ప్రతి ఇల్లు సర్వే చేసి అక్రమ ఓట్లను గుర్తించాలని కడప టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు సూచించారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేడెడ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అరాచకాలు, విధ్వంసాలు, అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. వీటితో పాటు దొంగ ఓట్లకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి డివిజనులో టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జ్‌లతో పాటు అక్కడున్న మిగతా కమిటీ సభ్యులు కలిసికట్టుగా ప్రతి ఇంటి సర్వే చేసి చనిపోయిన వారిని డబుల్‌ ఎంట్రీ ఉన్న వారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించి టీడీపీ మేనిఫెస్టోను వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ, నాయకులు శివరాం, ఆ మూరి బాలదాసు, సానపురెడ్డి శివకొండారెడ్డి, కొండా సుబ్బయ్య, జలతోటి జయకుమార్‌, రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising