వర్గీకరణ చేయకపోతే బీజేపీని ఓడిస్తాం
ABN, First Publish Date - 2023-09-22T23:25:36+05:30
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోతే బీజేపీ ని చిత్తు, చిత్తుగా ఓడిస్తామని రాష్ట్ర ఎంఆర్‌పీఎస్ నాయకుడు నగిరిపాటి చెంగయ్య తెలిపారు.
రైల్వేకోడూరు, సెప్టెంబరు 22: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోతే బీజేపీ ని చిత్తు, చిత్తుగా ఓడిస్తామని రాష్ట్ర ఎంఆర్‌పీఎస్ నాయకుడు నగిరిపాటి చెంగయ్య తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్నారు. లేక పోతే బీజేపీ నాయకులను మాదిగలు గ్రామాల్లో తిరగనివ్వరన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు నగిరిపాటి యానాదయ్య, పోలి హరిబాబు, నాగిపోగు పెంచలయ్య, తాడి సిద్ధయ్య, గొంటు రాయుడు, ముండ్లపల్లె నరసింహులు, పసుపులేటి జయరాం, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయచోటి(కలెక్టరేట్): ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని శుక్రవారం ఎంఆర్‌పీఎస్ నేత కేఎన్‌రాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన అనంతరం కలెక్టర్ పీఎస్ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోని బిల్లును ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ అన్నమయ్య జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:25:36+05:30 IST