ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టపగలే ఆలయంలో హుండీ చోరీ

ABN, First Publish Date - 2023-01-27T23:27:56+05:30

కోరిన కోరికలు తీర్చి, పిలిస్తే పలికే నల్గొండ నరసింహస్వామి ఆలయ హుండీ, విగ్రహాలు పట్టపగలే దొంగలు ఎత్తుకెళ్లారు. మండలంలో సంచలనం రేపుతున్న సం ఘటన వివరాల్లోకెళితే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సగిలేటి నీటిలో పడేసిన దుండగులు

బి.కోడూరు, జనవరి 27: కోరిన కోరికలు తీర్చి, పిలిస్తే పలికే నల్గొండ నరసింహస్వామి ఆలయ హుండీ, విగ్రహాలు పట్టపగలే దొంగలు ఎత్తుకెళ్లారు. మండలంలో సంచలనం రేపుతున్న సం ఘటన వివరాల్లోకెళితే.... ఎర్రిఓబన్నబావి సమీపాన తూర్పు కొండన నల్గొండ నరసింహస్వా మి ఆలయం ఉంది. స్వాతి నక్షత్రం రోజు దాదా పు వెయ్యి మంది భక్తులు వస్తుంటారు. శని, సో మవారాలు భక్తులు విరివిగా వస్తూ కానుకలు హుండీలో వేస్తుంటారు. ఈ క్రమంలో హుండీలో ఉన్న దాదాపుగా రూ.2లక్షలు, పంచలోహ లక్ష్మిదేవి విగ్రహం, నరసింహస్వామి బంగారు విగ్రహం, రెండు పెద్ద గంటలు, శఠగోపం దుండగులు అపహరించారు. దుండగులు ఖాళీ హుండీని కొండమోటుపల్లె వద్ద ఉన్న సగిలేటి నీటిలో పడేసి వెళ్లారు.

ఆలయ కమిటీ జయరాంబాబాను పూజారిగా నియమించారు. ఆయన శుక్రవారం ఉదయం 9.30కు పోరుమామిళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు తీసుకుని 10.30కు గుడి కి చేరుకున్నారు. దేవాలయం గేటు తీసి ఉండడంతో హుటాహుటిన దేవలంలోకి వెళ్లి చూడగా గర్భగుడి వాకిలి కూడా తెరిచి ఉండడం, హుండీ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గ్రహించాడు. గుడి పక్కకు వచ్చి చూడగా తెల్ల కారు వెళుతూ కనిపించిందని పూజారి తెలిపాడు. గుడి చాలా రోజుల నుంచి సీసీ కెమెరా నిఘాలో ఉంచారు.

కాగా చోరీకి పాల్పడ్డ దుండగులు పట్టపగలే పూజారి లేని సమయం చూసుకుని కారులో అక్కడికి వచ్చి విగ్రహాలు, హుండీ తీసుకుని వెళ్లి నేరుగా బి.కోడూరు పోలీసుస్టేషన్‌ దారిలోనే సగిలేట్లో హుండీ పడేసి వెళ్లారు. గతంలో కూడా ఐత్రంపేట, పోలేరమ్మ గుడి, పాయలకుంట్ల అభయాంజనేయస్వామి దేవాలయంలో హుండీలే టార్గెట్‌గా పెట్టుకుని చోరీలు చేయడం గమనార్హం. అప్పట్లో లోతుగా విచారణ చేపట్టి నిందితుల ను శిక్షించి ఉండింటే ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు కదా అని ప్రజలు చర్చించుకోవడం విశేషం. విషయం తెలుసుకున్న సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ నస్రి న్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని దేవాలయం పరిసరాలను పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ జాగిలాలను, ఫింగర్‌ ప్రింట్‌ వారు విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2023-01-27T23:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising