ఉపాధ్యాయులపై వేధింపులు మానుకోవాలి
ABN, First Publish Date - 2023-03-05T23:41:45+05:30
ఉపాధ్యాయులపై వేధింపులను వెంటనే ఆపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయచోటిటౌన్, మార్చి 5: ఉపాధ్యాయులపై వేధింపులను వెంటనే ఆపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య జిల్లా ఎస్టీయూ మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మరణించిన నలుగురు ఉపాధ్యాయు లకు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వాగ్దానాలను ఉపాధ్యాయ వర్గం సంపూర్ణంగా నమ్మి బలపర్చిం దన్నారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా సీపీఎస్ రద్దు ప్రస్తావన లేకపోవడం, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ఇవ్వకపోడం ఉపాధ్యా యులను దారుణంగా మోసం చేయడమేనన్నారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాఽథరెడ్డి మాట్లాడుతూ పేపరు పై ప్రమోషన్‌లు ఇచ్చి, చివరకు ప్రమోషన్ ఇవ్వకుండానే పని సర్దుబాటు చేసి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ వర్గాన్ని శత్రువుగా చూడడం, కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్టీయూ రాష్ట్ర సం యుక్త అధ్యక్షుడు సుబ్రమణ్యంరాజు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికా రంలో ఉన్నా ప్రభుత్వ కార్యకలాపాల్లో నిబద్ధతతో పనిచేసే ఉపాఽధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శించడం, యాప్‌లతో విద్యేతర అంశాలను తమపై రుద్ది, బోధన కుంటుపడే విధంగా వ్యవహరించడం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు మధుసూదన్, ఆదినారాయణరెడ్డి, శివారెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయ కులు రవీంద్రనాఽథ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సనావుల్లా, అంజద్‌బాషా, రామ కృష్ణారెడ్డి, మున్వర్‌బాషా, నాగరాజు, గోపీకృష్ణ, వెంకటసుబ్బయ్య, నరసిం హులు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T23:41:45+05:30 IST