ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వర్షాభావంతో వాడిన వేరుశనగ

ABN, First Publish Date - 2023-08-17T23:23:38+05:30

ఈ ఖరీఫ్‌ సీజనలో వర్షాభావం కారణంగా మండలంలో వేసిన వేరుశనగ పంట వాడిపోయో దశకు చేరుకొంది.

నిమ్మనపల్లె/రామసముద్రం, ఆగస్టు 17: ఈ ఖరీఫ్‌ సీజనలో వర్షాభావం కారణంగా మండలంలో వేసిన వేరుశనగ పంట వాడిపోయో దశకు చేరుకొంది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన ప్రారంభంలో వేరుశనగ పంటను వేసేందుకు రైతు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ మేరకు వేరుశనగ విత్తనాలను సిద్ధం చేసుకున్నా అదును కు వర్షం రాకపోడంతో పలువురు రైతులు సాగుకు విముఖత చూపిం చారు. కాగా కొందరు రైతులు ఒక సారి పడిన వర్షానికి వేరుశనగ పంటను సాగు చేశారు. అయితే విత్తనాలు వేసినప్పటి నుంచి వర్షం పడకపోవడంలో బాగా మొలకెత్తిన పంట ఎండవేడిమి వాపోతోంది. దీం తో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా కు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు వచ్చినట్లు రైతులు తెలిపా రు. అంతే కాకుండా ఇక 10రోజులు వర్షాలు పడక పోతే పంటను వదిలే సే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. నిమ్మనపల్లె మండలంలో 810 ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట సాగుచేయగా రామసముద్రం మం డలంలో ఈ ఏడాది 500హెక్టార్లలో మాత్రమే వేరుశనగను సాగుచేశా రు. గత ఏడాది 890 హెక్టార్లు వరుశనగ పంటను సాగుచేశారు. వ్యవ సాయ అధికారులు కూడా ఎకరాకు 15 నుంచి 17 బస్తాల దిగుబడి వచ్చిందని తెలిపారు. అతివృష్టి, అనావృష్టితో పంటల దిగుబ డి తగ్గి రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు వేరుశనగకు ఎంలాటి పంటనష్టాన్ని అంచ నావే యలేదని అధికారుల తెలిపారు. మిట్ట ప్రాతాంతాలో సాగు చేసిన వాణి జ్య పంటలు కంది, చిరుధాన్యాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పెట్టుబడి అయినా వస్తుందో రాదో..

ఎకరా పొలంలో వేరుశనగ సాగుచేశాను. దుక్కుల సమయం నుంచి తవ్వకాల వరకు దాదాపు రూ. 25వేల వరకు ఖర్చు వచ్చింది. అయితే తవ్వకాలలో కొందరికి 30వేల వరకు ఖర్చు వచ్చింది. విత్తనం వేసినప్పటి సుం చి ఇప్పటి వరకు వానలు కురయక వేరుశనగ చె ట్లు వాడిపోయో దశకు చేరుకొన్నాయి. ఇక వారం రోజుల్లో వానలు రాకపోతే పంటను వదిలేయాల్సి వస్తుంది.

- బాబురావు, రైతు, నిమ్మనపల్లె

Updated Date - 2023-08-17T23:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising