ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులపై ప్రభుత్వ ఒత్తిడి తగదు: సీపీఎం

ABN, First Publish Date - 2023-03-05T00:10:09+05:30

సచివాలయ సిబ్బంది చెత్త పన్ను వ సూలు చేయకపోతే వేతనాల్లో కోత విధిస్తామని ప్రభుత్వం చెప్పడం తగదని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప (సెవెన్‌రోడ్స్‌), మార్చి 4: సచివాలయ సిబ్బంది చెత్త పన్ను వ సూలు చేయకపోతే వేతనాల్లో కోత విధిస్తామని ప్రభుత్వం చెప్పడం తగదని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ సిబ్బంది వేతనాలకు చెత్త పన్ను వసూళ్లకు ముడిపెట్టడం అన్యాయమన్నారు. ప్రభుత్వం నగర ప్రజానీకాన్ని బెదిరించి భయపెట్టి చెత్త పన్ను వసూలు చేయాలనుకోవడం అవివేకమన్నారు. గతంలో విజయవాడ నగరంలో చెత్త పన్ను వసూలు టార్గెట్‌ పూర్తి చేయలేదనే కారణంతో సిబ్బంది జీతాల్లో కోత పెట్టారన్నారు. కడప నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న చెత్త పన్నుపై కౌన్సిల్‌ సమావేశంలో ప్రతి ఇంటి నుంచి రూ.40, 60 వసూలు చేయాలని తీర్మానం చేసిందన్నారు. ఈ తీర్మా నం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందడం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినా, ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయం మాచ్చుకోవాలని చెత్త పన్ను వసూలుకు, సచివాలయ సిబ్బంది వేతనాలకు కోతపెట్టే ప్రయత్నాలు మా నుకోవాలని హితవు పలికారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చే యాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం కడప నగర కార్యదర్శివర్గ సభ్యులు చంద్రారెడ్డి, నగర కమిటీ సభ్యుడు ఫారుక్‌ హుసేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising