ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్నచొప్పకు మంచి గిరాకీ

ABN, First Publish Date - 2023-01-29T23:03:56+05:30

జమ్మలమడుగు మండలంలో ఈసారి వరిసాగు కంటే అధికంగా జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేశారు.

జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో జొన్నచొప్ప ట్రాక్టర్లు తరలిపోతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు, జనవరి 29: జమ్మలమడుగు మండలంలో ఈసారి వరిసాగు కంటే అధికంగా జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. గతంలో జమ్మలమడుగు మండలంలో పలు గ్రామాల్లో వరిసాగు అధికంగా సాగు చేసేవారు. అధిక వర్షాల వలన వరి పంట సాగు చేసే రైతులకు ధరలు పెరిగి గిట్టుబాటు లేక జొన్నపంట సాగు చేశారు. దీంతో పంట దిగుబడి వచ్చి సుమారు నెల రోజుల నుంచి జొన్న పంట కోత పెట్టారు. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి గొరిగెనూరు, ధర్మాపురం, సలివెందుల, దేవగుడి, సుగుమంచిపల్లె తదితర ప్రాంతాల నుంచి రైతులు జొన్నచొప్పను కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్‌ జొన్నచొప్ప (గడ్డి) రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ఇంటికి చేరుకునేందుకు ఖర్చు అవుతోందని రైతులు తెలిపారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి జొన్నచొప్ప ట్రాక్టర్లు పట్టణంలో జోరుగా గ్రామాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2023-01-29T23:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising