ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కూలీ పనులకు వెళుతూ కానరాని లోకాలకు..

ABN, First Publish Date - 2023-09-21T23:31:49+05:30

కూలి పనులకు వెళుతూ ఒకరు కానరాని లోకాలకు వెళ్లారు. కూ లి పనుల కోసం ఆటోలో వెళు తుండగా జరిగిన ప్రమాదంలో లక్ష్మీ నరసమ్మ (60) మృతి చెం దగా డ్రైవరు సహా మరో ఎనిమి ది మందికి గాయాలైనట్లు పోలీ సులు తెలిపారు. వివరాల్లోకెళితే....

ఘటనా స్థలంలోనే మృతి చెందిన లక్ష్మీ నరసమ్మ

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, తొమ్మిది మందికి గాయాలు

బద్వేలు రూరల్‌, సెప్టెంబరు 21: కూలి పనులకు వెళుతూ ఒకరు కానరాని లోకాలకు వెళ్లారు. కూ లి పనుల కోసం ఆటోలో వెళు తుండగా జరిగిన ప్రమాదంలో లక్ష్మీ నరసమ్మ (60) మృతి చెం దగా డ్రైవరు సహా మరో ఎనిమి ది మందికి గాయాలైనట్లు పోలీ సులు తెలిపారు. వివరాల్లోకెళితే....

స్థానిక శివానగర్‌, ఫాతిమానగ ర్‌, రాధాకృష్ణనగర్‌ నుంచి దాదాపు తొమ్మిది మంది మహిళలు తిప్పనపల్లెలో వరి నాట్లు వేసే పనికి ఒప్పుకొన్నారు. గురువారం ఉదయాన్నే ఆటోలో తొమ్మిది మంది తిప్పనపల్లె కు బయల్దేరారు. బయనపల్లె వద్ద రోడ్డుపై చనిపోయి పడి ఉన్న పందిని తప్పించే క్రమంలో ఆటో ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. దీంతో ఘటనాస్థలంలోనే లక్ష్మీనరసమ్మ మృతి చెందగా, ప్రసన్న తీవ్ర గాయాలపాలైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రసన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కడపకు తరలించారు.

గాయాలైనవారిలో డ్రైవరు ఓబులేసు, అంజనమ్మ, రమణ మ్మ, రామలక్షుమ్మ, వెంగమ్మ, చిన్నక్క, కొండమ్మ, గంగమ్మ ఉన్నారు. లక్ష్మీ నరసమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రోదిస్తుండడం పలువురి కంట తడి పెట్టించింది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T23:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising