మహాలక్ష్మిగా కటాక్షించిన జగన్మాత
ABN, First Publish Date - 2023-10-17T23:59:12+05:30
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజైన మంగళవారం జగన్మాత మహాలక్ష్మిగా భక్తులను కటాక్షించారు.
మదనపల్లె అర్బన, అక్టోబరు17:దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజైన మంగళవారం జగన్మాత మహాలక్ష్మిగా భక్తులను కటాక్షించారు. పట్టణంలోని నీరుగుట్టవారిపల్లెలో వెలసిన తొగటవీరక్షత్రియులు కులదైవం చౌడేశ్వరీమాతకు ఉదయం అభిషేకాలు అర్చనలు విశేషపూజలు నిర్వహించారు. సాయం త్రం అమ్మవారికి వెండికవచంతో అలంకరించి, భక్తు లకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయకమిటీ అధ్య క్షుడు ఉప్పు రామచంద్ర, కార్యదర్శి జి.ప్రభాకర్, ట్రెజరర్ రామిశెట్టి లోకేష్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అల్పాహారం, భోజన వితరణ చేశా రు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు మోడెం వెంకట రమణ, మున్సిపల్ కౌన్సిలర్లు మందపల్లె రమణ, రామిశెట్టి శివయ్య, మాజీ కౌన్సిలర్లు నాగరాజ, నీల కంఠ, చంద్రశేఖర్, ప్రెస్‌రమణ, పురాణం చంద్రశే ఖర్, తొగట కార్పొరేషన డైరెక్టర్ శీలం రమణమ్మ, రమేష్, నాయకులు పాల్గొన్నారు. అలాగే వాసవీ భవన వీధిలో వెలసిన కన్యకాపర మేశ్వరీదేవి ఆల యంలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మ వారిని గాయత్రీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నాదేళ్లనారప్పవీ థి, ఈస్ట్‌కొత్తపేట, షిర్డీసాయిబాబాగుడివీధి, వేమన వీధి, టీఎన నాగిరెడ్డివీధి,సుభాస్‌రోడ్డు, ప్రకాశంవీధి, కమ్మగడ్డవీధి, బర్మావీధి నుంచి భక్తులు అమ్మవారికి సారె తీసు కొచ్చి సమర్పించారు. దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో మహాలక్ష్మి అలంకర ణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త పతాంజలీస్వామి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరీ దేవికి విశేషపూజలు నిర్వహించారు. దేవళంవీధిలో వెలసిన సోమేశ్వరస్వామి ఆలయంలో నరసింహ స్వామిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సొసైటీకాలనీలోని రామాయలంలో ఉత్సవాలను ఆలయకమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల వేడుకలలో భాగంగా మంగళ వారం చింతపర్తి వాసవీ అమ్మవారి ఆలయంలో వైష్ణ్ణ్ణవీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోనేటివీధిలోని కామేశ్వరస్వామి ఆలయంలో మీనాక్షి దేవిగాను, కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గజలక్ష్మిదేవిగా, నల్లవీరగంగాభవానీ ఆలయంలో ఓంశక్తిగా అమ్మవార్లు భక్తులకు దర్శ నమిచ్చారు. ఈసందర్భంగా విశేష సంఖ్యలో భక్తు లు హాజరై పూజలు చేసి మొక్కులు తీర్చుకు న్నారు. ఆలయాలు చెంత భక్తులకు తీర్థప్రసాద పంపిణీ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాలలో ఆల యాల ధర్మకర్తలు కాంతారాజు, కువైట్ శంకరాచారి, రమణారెడ్డి, తబ్జుల సతీష్, అర్చకులు గోనవరపు శీనాస్వామి, సత్యనారాయణ శాసి్త్ర, జనార్దనస్వామి, సుధీర్‌బాబు, భక్తులు పాల్గొన్నారు.
పీలేరులో: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పీలేరులోని రౌద్రాల అంకాళమ్మ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకా పర మేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా, మోడల్ కాలనీ వద్దనున్న ఎల్లమ్మదేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను మహిళా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. ఆయా ఆలయాల కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చా రు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఉద యాన్నే ఆలయంలో అర్చన, పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. కొత్తపేటలోని పోలేరమ్మ ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తుల కు దర్శనమిచ్చారు. అనంతరం అన్నదానం చేశారు.
కలకడలో:మండలంలోని కోనలో వెలసిన చౌడే శ్వరిదేవి ఆలయంలో రెండవ రోజైన మంగళవారం అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చా రు. కలకడలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకు న్నారు.
ములకలచెరువులో: ములకలచెరువులోని వాసవి కన్యకాపరమేశ్వరిదేవి అమ్మవారు మంగళవారం అక్షింతల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భక్తు లు అఽధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించు కుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
నిమ్మనపల్లెలో: మండలంలోని పెద్దమాదిగపల్లెలో వెలసినమాత్మతల్లి ఆలయంలో మంగళవారం నవ రాత్రుల సందర్భంగా అమ్మవారు కుంకుమ అలంక రణలో ప్రజలకు దర్శమిచ్చారు. అనంతరం అర్చకు లు అమ్మవారికి ప్రత్యేపూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొన్న భక్తులకు తీర్థప్రపాదాల తో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.
కలికిరిలో: కలికిరి యల్లమ్మ ఆలయంలో అమ్మవా రిని మంగళవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తు లకు దర్శనభాగ్యం కల్పించారు. దసరా నవరా త్రుల మూడవ రోజు అమ్మ వారికి వేకు జామునే అభిషే కాలు, అర్చనలు చేశారు. ఆలయ నిర్వాకులు అశోక్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మధుసూదన రెడ్డి, సురేం ద్రరెడ్డి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా పార్వతీ సమేత సోమేశ్వరాలయంలో పార్వతీదేవిని అన్నపూర్థ దేవి అలంకరణలో, స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని అన్న పూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి లలిత సహస్ర నామార్చన చేశారు. నిర్వాహ కులు, పూజారులు రామచంద్ర శాసి్త్ర, శివ కుమార్ శాసి్త్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశా రు.పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు.
Updated Date - 2023-10-17T23:59:12+05:30 IST