ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సత్యనారాయణస్వామి కల్యాణం

ABN, First Publish Date - 2023-05-02T00:00:25+05:30

చిప్పిలి గ్రామంలోని చిట్టి అన్నవరంలో వెలసిన సత్యనారాయణస్వామి ఆలయంలోని రమాదేవి సహిత సత్యనారాయణస్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన, మే1: చిప్పిలి గ్రామంలోని చిట్టి అన్నవరంలో వెలసిన సత్యనారాయణస్వామి ఆలయంలోని రమాదేవి సహిత సత్యనారాయణస్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షచ కార్యదర్శుల అమరనాధ్‌, రామ కృష్ణ ఆధ్వర్యంలో వేదపండితులు అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఉదయాన్నే స్వామివార్లకు ప్రత్యేకంగా అలం కరణ చేసి శాసో్త్రక్తంగా కల్యాణం చేశారు. అధికసంఖ్యలో భక్తులు కల్యాణో త్సవంలో పాల్గొని తిలకించారు. ఆలయ ఆవరణంలో ఆలయకమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. వివాహం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు జ్థానోదయప్రసాద్‌, రమణరావు, అక్షింతల కుమార్‌, దివాకర్‌, శివశంకర్‌, రవి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గజవాహనంపై ఊరేగిన వెంకన్న

మదనపల్లె అర్బన; మే1: దేవలంవీదిలోని ప్రసన్న వెంకటరమణస్వా మి ఆలయంలో సోమవారం స్వామివారిని గజవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాలు ఆలయ ఈవో రమణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

పీలేరులో మహాభారత యజ్ఞం ప్రారంభం

పీలేరు, మే 1: పంచమవేదమైన మహాభారత మహోత్సవ యజ్ఞం సోమవారం పీలేరులో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. పీలేరు ఆర్టీసీ బస్టాండు గ్యారేజీ సమీపంలో జరుగుతున్న మహోత్సవాన్ని ఆర్టీసీ, ఏపీట్రాన్సకో సిబ్బంది పట్టణానికి చెందిన కొందరు దాతల సహకారంతో సంయుక్తంగా ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహిస్తు న్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మహాభారత ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్రౌపదీ సమేత పాండవుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజారోహణం గావించారు. ఆర్టీసీ డీఎం బండ్ల కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక హో మం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కార్మిక సంఘ నేతలు పీఎస్‌ ఎం రాజు, రమణరాజు, ఎల్లయ్య, రాజేంద్ర నాయుడు, ఎర్రయ్య నాయుడు, బాలాజీ, మల్లిఖార్జున, హరినాథ్‌, పీవీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising