ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా నరసింహ స్వామి రథోత ్సవం

ABN, First Publish Date - 2023-05-02T23:39:02+05:30

మండలంలోని సీటీఎం గ్రామంలో వెలసిన లక్ష్మీనరసంహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

రథోత్సవంలో ఊరేగుతున్న లక్ష్మీనరసింహస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన, మే 2: మండలంలోని సీటీఎం గ్రామంలో వెలసిన లక్ష్మీనరసంహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి రథంను పూలతో అలంకరించి సీటీఎం వీధుల్లో వైభవంగా రఽథోత్సవం నిర్వహిం చారు. సీటీఎంకు చెందిన మాలాజీ మిల్‌ యాజమానులు రథోత్పవ ఉభయదారులుగా వ్యవహరించారు. గడ్డం శ్రీనివాసులు బ్రదర్స్‌తో కలిసి పుష్పాలకరణ సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఉద యాన్నే బ్రహోత్సవాల సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యే కంగా అభిషేకాలు, అర్చనలు విశేషపూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెమ్మ, వెలుగుచం ద్ర, సీటీఎం సన్పంచ సగనాల ఆనంద పార్థసారథి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు బుడ్డా, పోకల, దేశి, మోదే, పేర, మైలంవారి కుటుంబాలు అన్నదానం నిర్వహించారు. ఆందులో వందలాదిమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

రేపు కల్యాణోత్సవం

మదనపల్లె అర్బన, మే2: పట్టణంలోని అనపగుట్ట శ్రీవారినగర్‌లో వెల సిన అభయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయం తిని పురస్కరించుకుని 4వ తేదీ ఉదయం 10గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా 3వ తేదీ 10గంటలకు సుదర్శన నరసింహ హోమం జరుగుతుందని ఆల య ప్రధాన అర్చకుడు సోంపల్లె రమేష్‌ తెలిపారు.

Updated Date - 2023-05-02T23:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising