లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకం
ABN, First Publish Date - 2023-09-22T00:02:06+05:30
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్ప వని ఆర్డీవో మురళి హెచ్చరించారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 21: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్ప వని ఆర్డీవో మురళి హెచ్చరించారు. గురువారం స్థానిక సబ్‌కలెక్టరేట్ కార్యా లయంలో ప్రసూతి వైద్యులు, క్లినికల్ ల్యాబొరేటరి నిర్వాహకులకు పీసీ-పీఎన డీటీ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మదనపల్లె డివిజనలో 45 స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయవా టికి రిజిసే్ట్రషన, లైసె న్సు జారీపై అవగాహన కల్పించాలన్నారు. కేవలం కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు మూడు సార్లు స్కానింగ్ చేసుకోవచ్చని, అలా అని లింగ నిర్ధారణ కోసం చేస్తే ప్రోత్సహించిన వారితో పాటు చేయించుకున్న వారిని, చేసిన వారిని చట్టప్ర కారం శిక్షకు గురవుతారన్నారు. సమావేశంలో పీర్స్ సంస్థ ప్రతినిధి సీఎస్ పసల, రిడో సంస్థ ఈశ్వరయ్య, గైనకాలజిస్టులు, క్లినిక్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:02:06+05:30 IST