నిర్ణీత సమయానికి మూల్యాంకనం పూర్తి చేయాలి : వీసీ
ABN, First Publish Date - 2023-07-27T23:34:49+05:30
నిర్ణీత సమయానికి డిగ్రీ మూల్యాంకనం పూర్తి చేసే లా చూడాలని వైవీయూ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్ పేర్కొన్నారు. గురువారం యూనివర్సిటీలో జరుగుతున్న డిగ్రీ సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సమాధాన పత్రాలను హాజరును పరిశీలించా రు.
కడప(ఎడ్యుకేషన్), జూలై 27: నిర్ణీత సమయానికి డిగ్రీ మూల్యాంకనం పూర్తి చేసే లా చూడాలని వైవీయూ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్ పేర్కొన్నారు. గురువారం యూనివర్సిటీలో జరుగుతున్న డిగ్రీ సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సమాధాన పత్రాలను హాజరును పరిశీలించా రు. మూల్యాంకనం విధుల్లో ఉన్న అధ్యాపకుల సౌకర్యాల గురించి ఆరా తీశారు. ప్రతిభావంతుడైన ఏ విద్యార్థికి నష్టం జరగకూడదన్నా రు. విధి నిర్వహణలో సమయపాలన ముఖ్యమన్నారు. మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లపై పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ ఈశ్వర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సహాయ పరీక్షల నిర్వహణ అధికారులు డాక్టర్ ఆదినారాయణరెడ్డి, డాక ్టర్ సుమిత్ర పాల్గొన్నారు.
ఎకనామిక్స్ ఉర్దూ విభాగాల తనిఖీ : వైవీయూలో హ్యుమనిటీస్ విభాగంలోని ఎకనామిక్స్ ఉర్దూవిభాగాలను వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులకు వసతిగృహలు, బోధనా పరంగా మెరుగైన ప్రయోజనాలు కల్పించాల్సిన విషయంపై ఆరా తీశారు. కళాశాలకు క్రమం తప్పకుండా నిర్దేశిత సమయానికి హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. చక్కగా చదువుకుంటే యూనివర్శిటీ పరంగా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం ఆర్ట్స్‌బ్లాక్‌లోని సెమినార్ హాలును పరిశీలించారు. కార్యక్రమంలో హ్యుమనీటీస్ డీన్ ప్రొఫెసర్ తప్పెట రాజేంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-27T23:34:49+05:30 IST