ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-06-02T23:38:42+05:30

ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీ జీఈ ఏ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

తంబళ్లపల్లెలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఏపీజీఈఏ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, జూన 2: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీ జీఈ ఏ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తంబళ్లపల్లె తహసీల్దారు కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజీఈఏ నియోజకవర్గ సభ్యులు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ...ఏపీజీఈఏ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి తా లూకా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, సచి వాలయ అన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో రిలే దీక్షలు చేపడుతున్నా మన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. డీఎస్సీ ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐకు రక్షణ కల్పిం చడం, పదవీ విరమణ రోజునే ఉద్యోగికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయడం, 11వ పీఆర్సీ అమలులో భాగంగా ఆర్థికపరమైన బకాయిలను, డీఏ అరియర్స్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వాటితో పాటు సుమారు 200 న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఏపీజీఈఏ జిల్లా ట్రెజరర్‌ సుధాకర్‌రాజు, జిల్లా విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు రాజా, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆరోగ్య శాఖ, మహిళాశిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, ఆర్‌అండ్‌బి, ఖజానా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising