ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నదిలో బయటపడిన విద్యుత్తు స్తంభాలు

ABN, First Publish Date - 2023-09-02T23:38:37+05:30

గూడెం చెరువు పెన్నానది వంతెన వద్ద నుంచి తూర్పు, పడమర ప్రాంతంలో భారీగా ఇసుక తవ్వకాలు జరిగి గుంతలు దర్శనమిస్తున్నాయి. గ్రామ శివార్లలో పెన్నానదిలో ఇసుక తవ్వకాల వలన కొన్ని విద్యు త్తు స్తంభాలు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

అంబవరం పెన్నానదిలో బయట పడవేసిన విద్యుత్తు స్తంభం

ఇప్పటికీ నదిలో ఇసుక డంప్‌లు

ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని వినతి

జమ్మలమడుగు, సెప్టెంబరు 2: గూడెం చెరువు పెన్నానది వంతెన వద్ద నుంచి తూర్పు, పడమర ప్రాంతంలో భారీగా ఇసుక తవ్వకాలు జరిగి గుంతలు దర్శనమిస్తున్నాయి. గ్రామ శివార్లలో పెన్నానదిలో ఇసుక తవ్వకాల వలన కొన్ని విద్యు త్తు స్తంభాలు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పెన్నానదిలో ఏర్పాటు చేసుకున్న దారి పక్కనే విరిగిపోయిన విద్యుత్తు స్తంభాన్ని పడవేశారు. అయితే పెన్నానది వంతెన పడమర వైపు పొన్నతోట శివార్ల వరకు ఇసుక తవ్వకా లు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక ్కడ ఇసుకకు సంబంధించి అధికారికంగా రీచ్‌లు లేవని, వారం రోజు ల కిందటే సంబందిత అధికారులు స్థాని క నేతలకు తెలియజేయడం, ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఇదెక్కడి న్యాయమని, ఈ ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికారులను లెక్కచేయకుండా దోపిడీ యధేచ్ఛగా చేస్తున్నార ని ప్రజలు చర్చించుకుంటున్నారు.

పెన్నానదిలో ఇసుక ఖాళీ అయినా మైలవరం జలాశయం నుంచి కొంత నీటిని విడుదల చేసినప్పటి నుంచి పెన్నానదిలో ఇసుక తీసే చోట గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. అయితే ప్రస్తుతం రైతుల పొలాల్లో ఇసుక తీసుకుని వెళ్లాలన్నా పెన్నానది పక్కనే ఉన్నా మినిమం ఐదు వేల రూపాయలు పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇక గ్రామప్రజల పరిస్థితి ఇంటి నిర్మాణాలు చేయాలన్నా, గోడలకు పూతలు వేయాలన్నా ఇసుక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జమ్మలమడుగు ప్రాంతం నుంచి సుదూరప్రాంతాలకు ఇసుక తరలిపోతున్నా చర్యలు తీసుకునే అధికారులు లేరని ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ రవాణా జరిగే ఇసుక వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-09-02T23:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising